Car stuck in river: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా.. నీటిలో చిక్కుకొని బయటపడిన కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా అందమైన ప్రదేశాల్లో ప్రయాణం, ప్రకృతిలో విహరించడం అందరికీ ఇష్టమే. ఇలాంటి సమయంలో కొందరు ఇబ్బందుల్లో చిక్కుకుంటుంటారు. కొందరు ప్రాణాలు కూడా పొగొట్టుకుంటుంటారు. సాధారణంగా నీటి ప్రవాహం ఉన్న ప్రదేశాలలో తరచూ ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులకు సహాయం అందించడానికి NDRF బృందం లేదా సైన్యం రంగంలోకి దిగుతుంది. ఇలాంటి వాటికి సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా.. ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.. ఇది చూస్తే రోమాలు నిక్కపొడుస్తాయి. వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.
వాస్తవానికి నది ప్రవాహంలో ఒక కారు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్ తన అవగాహన, సామర్ధ్యంతో తనను తాను ఇబ్బందుల నుంచి తృటిలో తప్పించుకోగలిగాడు. అందుకే మనిషి తనను తాను నమ్ముకుని లక్ష్యం వైపు పయనిస్తూనే ఉంటే.. విజయం వరిస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ వీడియోలో నది ప్రవాహం వేగంగా పెరుగుతుండటం, మరోవైపు ప్రవాహానికి తోడుగా ఓ కారు వేగంగా దూసుకురావడం కూడా వీడియోలో చూడవచ్చు. డ్రైవర్ ధైర్యంతో తన లక్ష్యం వైపు వేగంగా కదులుతూ.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడతాడు.
వైరల్ వీడియో చూడండి..
जिसे खुद पर भरोसा है,
वो हर मुश्किल से निकल सकता है. pic.twitter.com/DVOzWQpTXg— Dipanshu Kabra (@ipskabra) April 30, 2022
ఈ షాకింగ్ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘ఎవరు తనపై నమ్మకం కలిగి ఉంటారో, అతను ప్రతి కష్టం నుండి బయటపడగలడు’ అంటూ క్యాప్షన్ కూడా రాశారు. కేవలం 26 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 77 వేలకు పైగా వీక్షించగా.. 5 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
Also Read: