Watch: కారులో విలువైన వస్తువులు పెడుతున్నారా..? ఈ వీడియో చూస్తే భయపడతారు..!

సాధారణంగా అందరూ కారు పార్క్ చేసినప్పుడు విలువైన వస్తువులను అందులోనే వదిలి వెళ్తుంటారు. కానీ, ఇలా చేయటం ఎంత ప్రమాదకరమో చూపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక దుండగుడు పార్క్‌ చేసి ఉంచిన కారు అద్దం పగలగొట్టి, లోపల ఉన్న బ్యాగ్‌ను దొంగిలించాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. హెల్మెట్ ధరించుకుని వచ్చిన దుండగుడు స్క్రూ డ్రైవర్‌తో అద్దం పగలగొట్టి బ్యాగ్‌ను తీసుకుని ఏమి జరగనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అయితే, ఆ బ్యాగ్‌లో రూ.12లక్షల నగదు ఉన్నట్టుగా తెలిసింది.

Watch: కారులో విలువైన వస్తువులు పెడుతున్నారా..? ఈ వీడియో చూస్తే భయపడతారు..!
Faridabad Car Theft

Updated on: Oct 18, 2025 | 11:01 AM

సాధారణంగా అందరూ కారు పార్క్ చేసినప్పుడు విలువైన వస్తువులను అందులోనే వదిలి వెళ్తుంటారు. కానీ, ఇలా చేయటం ఎంత ప్రమాదకరమో చూపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక దుండగుడు పార్క్‌ చేసి ఉంచిన కారు అద్దం పగలగొట్టి, లోపల ఉన్న బ్యాగ్‌ను దొంగిలించాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. హెల్మెట్ ధరించుకుని వచ్చిన దుండగుడు స్క్రూ డ్రైవర్‌తో అద్దం పగలగొట్టి బ్యాగ్‌ను తీసుకుని ఏమి జరగనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అయితే, ఆ బ్యాగ్‌లో రూ.12లక్షల నగదు ఉన్నట్టుగా తెలిసింది.

ఫరీదాబాద్‌లో ఒక షాకింగ్ దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 24లోని ఒక కంపెనీ బయట ఆపి ఉంచిన కారు కిటికీని పగలగొట్టి డబ్బుతో నిండిన బ్యాగ్‌ను దొంగిలించాడు. ఈ బ్యాగ్‌లో రూ. 12లక్షల నగదు ఉన్నట్టుగా తెలిసింది. ఈ సంఘటన మొత్తం బయట ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలో రికార్డైంది. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.

కారు యజమాని ఫరీదాబాద్‌లోని సెక్టార్ 17లో నివసించే వికాస్‌గా గుర్తించారు. కెడి ఇండస్ట్రీస్ అనే కంపెనీ సెక్టార్ 24లోని ప్లాట్ నంబర్ 167లో చొక్కా బటన్లను తయారు చేస్తుందని తెలిసింది. అతను సమీపంలోని సెక్టార్ 89లో నివసించే తన రూమ్‌ పార్టనర్‌ రాహుల్‌తో కలిసి అక్కడ పనిచేస్తున్నాడు. శుక్రవారం, అతని రూమ్‌ పార్టనర్‌ రాహుల్ రూ. 12లక్షల నగదుతో కంపెనీకి వచ్చాడు. రాహుల్ తన కారును కంపెనీ బయట పార్క్ చేశాడు.

ఇవి కూడా చదవండి

కొద్దిసేపటికే ఇద్దరు యువకులు బైక్ పై వచ్చారు. ఇద్దరూ హెల్మెట్లు ధరించారు. వారిలో ఒకడు పదునైన ఆయుధంతో కారు అద్దాన్ని పగలగొట్టి, డబ్బుతో నిండిన బ్యాగును దొంగిలించి, ఇద్దరూ బైక్ పై పారిపోయారు. తిరిగి కారు వద్దకు వచ్చిన వికాస్‌, రాహుల్‌ బిత్తర పోయారు. కారు అద్దం పగిలిపోయి ఉండటం, కారులో నగదు బ్యాగ్‌ కనిపించక పోవడంతో బోరుమన్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ బ్యాంకు నుండి రూ. 7 లక్షలు విత్‌డ్రా చేసుకున్నాడు, ఇంట్లో రూ. 5 లక్షల నగదు ఉంది. మొత్తం రూ. 12 లక్షలతో అతను కంపెనీకి చేరుకున్నాడు. నిందితులను పట్టుకోవడానికి నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దొంగతనం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేరస్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకు నుంచి రాహుల్ కారును నిందితులు వెంబడిస్తున్నట్లు భావిస్తున్నారు. కంపెనీ వెలుపల అవకాశం దొరికిన వెంటనే వారు బ్యాగ్‌తో పారిపోయారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..