Viral Video: సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలో వైరల్ అవుతుంటాయి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నిత్యం అనేక వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ యాక్సెడెంట్‌కు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా.. ఓ కారు నేరుగా రిజర్వాయర్‌లోకి దూకేసి స్విమ్మింగ్ చేసింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా.. కారేంటి? స్విమ్మింగ్ ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వార్తను పూర్తిగా చదవాల్సిందే.
వివరాల్లోకెళితే.. యూరప్ లోని లాట్వియా దేశంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లాట్వియాలో రిగాలో రద్దీగా ఉండే రోడ్డులో ఓవైపు కార్లను పార్కింగ్ చేశారు. ఇంతలో ఓ కారు.. నెమ్మదిగా వెనక్కి కదులింది. రహదారి మధ్యకు వచ్చింది. ఇంతలో రోడ్డుపై వెళ్తున్న మిగతా కార్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. అసలు ఆ కారు ఎటువైపు వెళ్తుందో అర్థం కాక రోడ్డుపైనే నిలిపివేశారు కార్లను. ఇక ఆ కారులో డ్రైవర్ లేడని, హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అది స్లోప్‌గా ఉన్నవైపు ఆటోమాటిక్‌గా కదిలినట్లు గుర్తించారు. ఇంతలోనే కారు పక్కనే ఉన్న రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లింది. నది గట్టున నిర్మించిన మెట్ల మార్గం ద్వారా ఆ కారు నదిలో పడిపోయింది. అయితే, నదిలో పడిపోయిన కారు మునిగిపోకుండా.. నీటిపైనే తేలియాడింది. నీటిలో రౌండ్‌గా ఈదుతున్నట్లు రివర్స్‌లో తిరిగింది. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డవగా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. వీడియోలో కారు నీటిలో పడిపోయిన దృశ్యాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Also read:
Health Tips: వేసవిలో ‘విటమిన్ డి’ పొందలేకపోతున్నారా? ఈ పండ్లను డైట్‌లో చేర్చితే సరి..
CM Jagan: అవినీతిపై ఫిర్యాదులకు ప్రత్యేక యాప్.. ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం
Gangubai Kathiawadi: ఓటీటీలో సందడి చేయనున్న గంగూబాయి.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..