ఇంటర్నెట్‌లో ఫన్ కంటెంట్‌కు కొదవ ఉండదు. ఎన్నో రకాల వైరల్ వీడియోలు, ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఫన్నీ మీమ్స్‌తో పాటు ఫోటో పజిల్స్ కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇవి నెటిజన్లను భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఫన్‌తో పాటు మెదడుకు పదును పెట్టడంలో ఫోటో పజిల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. మీ ఐ పవర్‌ను టెస్ట్ చేయడమే.. కాదు కొన్నిసార్లు మాయ కూడా చేస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. పైన కనిపిస్తోన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి అటవీ ప్రాంతంలో తీసినట్లుగా ఉన్న ఆ ఫోటోలో ఎక్కడ చూసినా ఎండిన ఆకులు, కర్రలు నిండి ఉన్నాయి. అందులోనే ఆ పాము నక్కి ఉంది. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో విఫలమయ్యారు. పామును కనిపెట్టలేక పప్పులో కాలేశారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి ఫోటోపై లుక్కేయండి.. సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూసేయండి..
here is the answer pic.twitter.com/5mjJmTeHnl
ఇవి కూడా చదవండి— telugufunworld (@telugufunworld) July 7, 2022