సోషల్ మీడియాలో ట్రెండింగ్ కంటెంట్‌కు కొదవలేదు. మనం కాస్త రిలాక్స్ అవ్వాలంటే.. నెట్టింట్లోకి వెళ్లి వెతుకులాట ప్రారంభిస్తే చాలు కావాల్సినంత వినోదం లభిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఫోటో పజిల్స్ కూడా ఒకటి. సాధారణంగా పజిల్స్‌పై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఫలానా ఫోటోలో ఏముందో కనిపెట్టేందుకు వీక్షకులు శతవిధాలా ప్రయత్నిస్తారు. క్యూరియోసిటీతో తగ్గేదే..లే అన్నట్లు అందులో ఏముందో కనిపెట్టేవరకు ఆ పజిల్‌ను విడిచిపెట్టం.
మనల్ని గందరగోళానికి గురిచేసే కొన్ని ఫోటో పజిల్స్‌ను మీరు చూసే ఉంటారు. అవి ఫోటోషాప్ మేజిక్‌తో కూడినవి కావొచ్చు.. లేదా ఫోటోగ్రాఫర్ కెమెరా స్కిల్స్ కావొచ్చు. అలాంటి ఫోటోలు మాత్రం మన మెదడుకు కావాల్సినంత మేత వేయడమే కాకుండా కళ్లకు కూడా పదును పెడతాయి. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పైన ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడ ఉందో మీరు గుర్తించాలి. ఆ ఫోటోను మీరు తీక్షణంగా చూస్తే ఏవో ఎండిన పిచ్చి మొక్కలు మాదిరిగా మీకు కనిపించవచ్చు. ఆ మొక్కల్లో పాము దాగుంది. పాము చర్మం రంగు.. ఆ ఎండిన మొక్కల రంగుతో ఇమిడిపోయింది. అందువల్ల మీరు ఆ విషసర్పాన్ని కనిపెట్టడం కష్టమే. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. నూటికి 95 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ప్రయత్నించండి. ఒకవేళ ఆన్సర్ దొరక్కపోతే.. క్రింద ఫోటోను చూడండి.
Also Read:
ఈ ఫోటోలో చిరుత దాగుంది.. పజిల్ సాల్వ్ చేస్తే గ్రేటే.. ఫెయిల్ అవ్వడం ఖాయం!
మన కరెన్సీ నోట్లపై నల్లటి గీతలు మీరెప్పుడైనా చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.!
Here is the answer.. pic.twitter.com/HbqDRghjde
— telugufunworld (@telugufunworld) December 16, 2021