Trending: డైలీ నెట్టింట రకరకాల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అయితే మనల్ని ఆశ్చర్యపరిచే ఫోటోలు కొన్ని ఉంటాయి. విస్మయానికి గురి చేసేవి కొన్ని ఉంటాయి. ఇంకొన్ని ఫోటోలు కన్‌ఫ్యూజ్ చేస్తాయి. అవే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు. ఇలాంటి ఫోటోలు చూస్తే బుర్ర గింగిరాలు తిరుగుతుంది. అక్కడ ఉన్నది ఒకటి.. మనకి కనిపించేది ఒకటి. ఇలాంటి ఫోటోస్ ప్రజంట్ సోషల్ మీడియా(Social Media)లో ట్రెండ్ అవుతున్నాయి. ఇవి మన IQ లెవల్‌ను, మన ఐ పవర్‌ను టెస్ట్ చేస్తాయి. మన మైండ్‌కు ఓ వ్యాయామంలా ఉపయోగపడాయి. ఫస్ట్ చూడగానే వీటిలోని మిస్టరీ ఏంటో కనిపెట్టడం చాలా కష్టం. అలాంటి ఓ వైరల్ బ్రెయిన్ టీజర్ మీ ముందుకు తీసుకువచ్చాం. ఇందులోని నెంబర్ ఏంటో మీరు కనుగొనాలి. ముందుగానే చెప్తున్నాం ఇది చాలా కష్టం. క్లూ ఏంటంటో.. కాస్త ఫోన్‌ను అటూ, ఇటూ వంచి చూస్తేనే ఆన్సర్ ఏంటి అన్న దానికి కాస్త దగ్గరిగా వస్తారు. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేక చేతులెత్తిశారు. మీ కళ్లలో పవర్ ఎక్కువగా ఉంటే ఆ నంబర్‌ను కొద్ది సెకన్లలోనే కనిపెట్టవచ్చు. మరొక్కసారి ట్రై చేయండి.
ఏంటి ఇంకా సమాధానం కనుక్కోలేకపోయారా..? అయితే మేమే చెప్పేస్తాం. ఈ ఫోటోలో ఉన్నది… నెంబర్ 17. కాస్త ఫోన్‌ని అటుకానీ, ఇటుకానీ వంచి చూస్తే మీకు ఆ నెంబర్ కనబడుతుంది. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇలాంటి పజిల్స్ మీ ముందుకు తీసుకొస్తాం. మీ మైండ్‌కి మేత వేయడానికిి, మీ ఐ పవర్ టెస్ట్ చేయడానికి రెడీ అవ్వండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.