ప్రస్తుతం నెట్టింట పజిల్స్ ఏ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇవి నెటిజన్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. మీ ఐ ఫోకస్, ఐక్యూ లెవల్, అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ మాత్రం ఉన్నాయో చెప్పేస్తాయి. అంతేకాదు మీ బుర్రను ఇంకాస్త పదును పెట్టేందుకు కూడా సాయపడతాయి. అయితే వీటిలో కొన్ని ఈజీగా అనిపించినా మరికొన్ని మాత్రం చాలా టఫ్. అంత ఈజీ కాదు. కొన్నిసార్లు సమాధానాలు దొరక్క మీ బుర్ర వేడెక్కుతుంది. అంటే మనతోనే అవి రివర్స్ గేమ్ ఆడతాయి అనమాట. ఇలాంటి పజిల్స్ రెగ్యులర్‌గా సాల్వ్ చేస్తుంటే.. మన చురుకుదనం పెరగుతుంది. అలా నెట్టింట బాగా వైరల్ అవుతోన్న ఓ పజిల్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. పదండి దాని సంగతి తేలుద్దాం…
ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే.? పైన ఇచ్చిన ఫోటోలో.. మీకు ‘6’ నెంబర్లతో కూడిన సిరీస్ కనిపిస్తోంది కదూ.. అక్కడే వాటి మధ్యలో ‘5’ నెంబర్ కూడా కొన్ని చోట్ల ఉంది. 5 నంబర్ ఎక్కడెక్కడ ఉందో 50 సెకన్లలో మీకు కనిపెడితే మీరే గ్రేట్. మీరు ఇస్మార్ట్ ఫెల్లోస్ అయితే కేవలం 10 సెకన్లలో సమాధానాలు గుర్తిస్తారు. అయితే మరీ చిక్కుముడిగా అనిపిస్తుంది అనేవారి కోసం ఓ చిన్న క్లూ..! రెండేసి ‘5’ నెంబర్స్.. రెండు వరుసలలో దాగి ఉన్నాయి. ఇప్పుడు ట్రై చేస్తే చాలామంది విన్ అవుతారు.. ఆన్సర్ మీకు దొరికితే ఓకే.. లేదంటే.. చింతించకండి.. మేం దిగునవ ఇస్తున్నాం. ఈ సారి ఇచ్చినప్పుడు బాగా ట్రై చేయండి.
Puzzle Answer
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..