
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో చాలా వరకు వ్యక్తులు చేసే జుగాఢ్ వీడియోలతో పాటు ఇంటి పనుల్ని సింపుల్ చేసే చిత్ర విచిత్రమైన ఉపాయాలు, ట్రిక్స్, టిప్స్ కూడా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ తన ఇంట్లోని వాషింగ్ మెషిన్‌లో మురికి బట్టలతో పాటు కొన్ని పారాసెటమాల్ మాత్రలను వేసి మెషిన్ ఆన్ చేస్తుంది. కొంత సమయం తర్వాత బట్టలను బయటకు తీయగా, అవి ఎంతో శుభ్రంగా, ఎటువంటి మరకలు లేకుండా కొత్తవాటిలా మెరిసిపోతూ కనిపిస్తాయి.
అంతేకాకుండా, కాలర్ భాగంలో పసుపు రంగు మరకలు పడిన ఒక తెల్లటి చొక్కాను నీటితో నిండిన టబ్‌లో ముంచి, అందులో పారాసెటమాల్ మాత్రలను వేస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ చొక్కాను బయటకు తీసి చూడగా, కాలర్ పై ఉన్న పసుపు మరకలు పూర్తిగా తొలగిపోయి చొక్కా తెల్లగా మెరిసిపోతుంది.
ఈ వీడియో @acharyaveda_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా షేర్ చేయబడగా, ఇప్పటికే దీనిని లక్షలాది మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. ఈ ట్రిక్ చూసి కొందరు వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇది ఒక మ్యాజిక్ అని అభివర్ణిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రాణ రక్షణకు ఉపయోగపడే వైద్య మందులను ఇలా ఉతుకుడు పనులకు ఉపయోగించడం అనవసరం, మందుల దుర్వినియోగం అని విమర్శిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
सफ़ेद कपडे से मैल हटाने का सबसे आसान तरीका… pic.twitter.com/vQn2Ijhq4T
— 𝗩𝗲𝗱𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮 (@acharyaveda_) October 5, 2025
ఎవరైనా ఇది నిజంగా పనిచేస్తుందో లేదో ప్రయత్నించి చెబితే, నేను కూడా ప్రయత్నిస్తాను అని ఒకరు రాయగా, నేను ఇప్పటికే దీనిని ఉపయోగించాను, ఈ ఆలోచన బాగా పనిచేసింది అని మరొకరు కామెంట్ చేశారు. ఇలాంటి హ్యాక్స్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, సాధారణ బట్టల సబ్బులు లేదా డిటర్జెంట్ పొడులు అందుబాటులో ఉన్నప్పుడు మందులను వృథా చేయడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, ఈ వీడియో పాతది అని తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..