Anand Mahindra: ‘మస్క్‌.. నేను టికెట్ ఎక్కడ కొనాలి’.. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌

|

Oct 15, 2024 | 7:49 AM

ప్రపంచ కుబేరుళ్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌ అద్భుతాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. నింగిలోకి వెళ్లి రాకెట్ బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ప్యాడ్‌ దగ్గరకు సురక్షితంగా చేర్చి స్పేస్‌ ఎక్స్‌ సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఇప్పటి వరకు అంతరిక్ష చరిత్రలో ఇలాంటి ఘనతను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం...

Anand Mahindra: మస్క్‌.. నేను టికెట్ ఎక్కడ కొనాలి.. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌
Anand Mahindra, Elon Musk
Follow us on

ప్రపంచ కుబేరుళ్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌ అద్భుతాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. నింగిలోకి వెళ్లి రాకెట్ బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ప్యాడ్‌ దగ్గరకు సురక్షితంగా చేర్చి స్పేస్‌ ఎక్స్‌ సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఇప్పటి వరకు అంతరిక్ష చరిత్రలో ఇలాంటి ఘనతను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఆదివారం చేపట్టిన ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీనిపై ప్రపంచమంతా మాట్లాడుకోవడం మొదలు పెట్టింది. కాగా ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ విజయవంతంగా దాని లాంచ్ ప్యాడ్‌కు తిరిగి వచ్చిన విషయమై సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.

సదరు ప్రయోగానికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ ఆదివారం స్పేస్‌ఎక్స్ ప్రయోగం జరుగుతున్న సమయంలో టీవీ ముందే ఉండిపోయాను. స్పేస్‌ఎక్స్ తిరిగిరావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రయోగం.. అంతరిక్ష ప్రయాణంలోనే కీలకమైన క్షణం కావచ్చని ఆనంద్ మహీంద్రా పేర్కొంటూ మస్క్‌ను ప్రశంసించారు. అలాగే మస్క్‌.. నేను నా టికెట్‌ను ఎక్కడ కొనాలి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే అంతరిక్షంలోకి దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్‌ రాకెట్ బూస్టర్ సురక్షితంగా భూమిపైకి రావడం చారిత్రాత్మకమని చెప్పాలి. అంతరిక్ష ప్రయాణంలో ఇదొక మైలు రాయిగా అభివర్ణిస్తున్నారు. భవిష్యత్తులో స్పేస్‌ టూరిజంకు ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. సూపర్ హెవీ బూస్టర్‌ రాకెట్ ఇలా మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి అవంతరాలు లేకుండా భూమిపైకి తిరిగి సురక్షితంగా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..