Viral Video: బస్సు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు.. మెరుపు వేగంతో రక్షించిన కండక్టర్.. షాకింగ్ వీడియో..!

|

Jun 07, 2024 | 4:08 PM

కేరళలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో నుంచి కిందపడబోయిన ప్రయాణికుడిని రెప్పపాటులో రక్షించాడు ఓ బస్సు కండక్టర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పందళం-చవర రహదారిపై కరాలిముక్ వద్ద బస్సు కండక్టర్ బిను ఒక ప్రయాణికుడిని రక్షించాడు.

Viral Video: బస్సు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు.. మెరుపు వేగంతో రక్షించిన కండక్టర్.. షాకింగ్ వీడియో..!
Bus Conductor Saves Passenger
Follow us on

కేరళలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో నుంచి కిందపడబోయిన ప్రయాణికుడిని రెప్పపాటులో రక్షించాడు ఓ బస్సు కండక్టర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పందళం-చవర రహదారిపై కరాలిముక్ వద్ద బస్సు కండక్టర్ బిను ఒక ప్రయాణికుడిని రక్షించాడు.

కొల్లం మన్రోతురుట్‌కు చెందిన బిను దాదాపు 8 ఏళ్లుగా ఈ బస్సులో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సస్తంకోట తోపిలముక్కలో నివాసముంటున్నాడు. విధుల్లో భాగంగా బస్సులో ఎక్కిన ప్రయాణికుడు టికెట్ తీసుకున్నాడు. తిరిగి చిల్లర ఇచ్చే క్రమంలో ప్రయాణికుడు డోర్ల మెట్ల వద్ద జారి కిందకు పడబోయాడు. బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడు ఒక్కసారిగా కిందపడిపోతుంటే కండక్టర్ సినీ హీరో రేంజ్ లో కాపాడాడు. కండక్టర్ టికెట్ కొట్టుకుంటూనే ప్రయాణికుడు పడటం చూసి చేయి పట్టుకుని కాపాడాడు.

వీడియో చూడండి… 

బస్సులో నుంచి ప్రయాణికుడు జారిపడి కండక్టర్ చేతికి తగలడంతో అతడు మెరుపు వేగంతో యువకుడిని రక్షించాడు. కండక్టర్ వల్ల పెద్ద పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కండక్టర్ మంచి స్పైడర్ మ్యాన్ లా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు. హఠాత్తుగా ప్రమాదం జరిగినప్పుడు తనకు తెలియకుండానే అలా రియాక్ట్ అయ్యానని కండక్టర్ బిను తెలిపాడు. ఏది ఏమైనా ఈ వీడియో చూసిన చాలా మంది దేవుడి హస్తం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…