Viral Video: అమ్మ బాబోయ్.. బ్యాంకుకు వచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? షాకింగ్ వీడియో

|

Jan 11, 2024 | 6:12 AM

సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ.. కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి.. వీటిని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతుంటారు.. అంతేకాకుండా ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటూ.. ఆనందపడిపోతుంటారు.. తాజాగా..అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

Viral Video: అమ్మ బాబోయ్.. బ్యాంకుకు వచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? షాకింగ్ వీడియో
Bull enters SBI branch -Viral Video
Follow us on

సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ.. కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి.. వీటిని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతుంటారు.. అంతేకాకుండా ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటూ.. ఆనందపడిపోతుంటారు.. తాజాగా..అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీంతో అందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో జరిగింది.. షాహ్‌గంజ్ SBI బ్రాంచ్‌లోకి అకస్మాత్తుగా ఎద్దు ప్రవేశించింది. తలుపు తీసి ఉండటంతో అది నేరుగా లోపలికి ప్రవేశించింది.. ఈ క్రమంలో ఎద్దును చూడగానే బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు తమను తాము రక్షించుకునేందుకు అటు ఇటు పరుగులు తీశారు.

ఎద్దు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బ్యాంకులోకి ప్రవేశించినట్లు కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో పోస్ట్ చేశారు. ఆ సమయంలో బ్యాంకులో చాలా మంది ఉన్నారు. అయితే, బ్యాంకులోకి ప్రవేశించిన ఎద్దు ఓపికతో కాసేపు నిలబడింది. అది ఎలాంటి హాని తలపెట్టలేదు.. కొంతసేపటి తర్వాత సెక్యూరిటీ గార్డు ఎద్దును తరిమికొట్టాడు.

వీడియో చూడండి..

అయితే బ్యాంకు లోపల ఎద్దు కనిపించడంతో గందరగోళం నెలకొంది. చాలా మంది అది పొడుస్తుందేమోనని.. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

అయితే, ఎద్దు బ్యాంకుకు వచ్చిన సమయంలో కొందరు ఇప్పుడు.. లంచ్ టైమ్ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా నయం ఎద్దు ఏం చేయలేదు.. దానంతట అదే వెళ్లిపోయింది.. లేకపోతే సీన్ సితారయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..