ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని పెంపుడు జంతువులు అయితే మరికొన్ని అడవుల్లో నివసిస్తుంటాయి. అవి ప్రశాంతంగా జీవితం కొనసాగిస్తున్నాయి. అయితే వాటిని కదిలిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వాటి జంతువుల జాబితాలో వచ్చే వాటిలో ఎడ్లు ముందువరసలో ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఇవి.. కోపం వస్తే మాత్రం విశ్వరూపం చూపిస్తాయి. వాటి కోపం కారణంగా కొన్ని దేశాల్లో ఎడ్ల పోరాటం కూడా జరుగుతుంది. అంతే కాదు దీనిని ఓ ఆటగానూ మార్చేశారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎడ్ల పోటీల్లో ఓ ఎద్దు తన కోపాన్ని చూపిస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో..ఎడ్ల పోటీలు జరుగుతుంటాయి. వాటిని చూసేందుకు ప్రేక్షకులు తరలివస్తారు. ఒక వ్యక్తి వాటి ముందు నిలబడి రమ్మని సైగ చేస్తూ ఆహ్వానిస్తాడు. అనంతరం ఓ ఎద్దు ఆ వ్యక్తి వైపు దూసుకువస్తుంది. అతడ్ని కొమ్ములతో దాడి చేసి కింద పడేస్తుంది. ఎద్దు దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఎద్దు చాలా సార్లు దాడి చేయడం వల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు ఎద్దును అదుపులోకి తీసుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
That’s what u get if u play with a bull! pic.twitter.com/Vmp5HoPDnR
ఇవి కూడా చదవండి— Crazy Tweets ??? (@Crazytweets100_) August 7, 2022
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఒక నిమిషం 12 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 22 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది కూడా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సంఘటన అని కొందరు, గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి