Viral Video: రేయ్ ఎవర్రా మీరంతా..!! సింహాన్ని గాలిలోకి ఎగరేసి ఆడుకున్న గేదెలు

|

Oct 20, 2022 | 12:42 PM

అడవికి రాజైన సింహాన్ని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడతాయి. కానీ తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో మాత్రం ఒక సింహాన్ని గేదెలు ఒక ఆట ఆడుకున్నాయి

Viral Video: రేయ్ ఎవర్రా మీరంతా..!! సింహాన్ని గాలిలోకి ఎగరేసి ఆడుకున్న గేదెలు
Buffalo , Lion
Follow us on

సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు మరీ.. నెటిజన్లు కూడా జంతువులకు సంబంధించిన వీడియోలనే ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు. ఇక అడవికి రాజైన సింహాన్ని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడతాయి. కానీ తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో మాత్రం ఒక సింహాన్ని గేదెలు ఒక ఆట ఆడుకున్నాయి. నిజానికి సింహం గేదెలను ఎక్కువగా వేటాడుతుంది.  గేదెను వేటాడగలిగితే, అవి దాదాపు ఐదు రోజులు వేటాడాల్సిన అవసరం లేదు. అయితే, వేటాడే సింహాలకు గేదెను చంపడం అంత సులభం కాదు. కొన్ని సార్లు ఆ గేదలు కూడా సింహాలకు రివర్స్ అవుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే..

సింహాలు గుంపుగా గేదెలను వేటాడతాయి. ఎందుకంటే గేదెలు తమ కొమ్ములతో సింహాలను పై దాడికి ప్రయత్నిస్తాయి. అందుకనే గుంపుగా వాటి పై దాడి చేస్తూ ఉంటాయి. సింహం పిల్ల పై గేదెలు దాడి చేసిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.  వీడియోలో, సింహం పిల్ల చుట్టూ గేదెల మందకనిపిస్తోంది. గేదె ఫుట్‌బాల్‌ను తన్నినట్లుగా సింహాన్ని గాలిలోకి విసిరేయడం ఈ వీడియోలో చూడవచ్చు. సింహం పిల్లను చాలాసార్లు క్రూరంగా విసిరిన దృశ్యాలు ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఎర్త్ రీల్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..