Viral News: ఒకే చెట్టుకు 1200కు పైగా టమాటాలు.. గిన్నిస్‌ బుక్‌లో చోటు.. ఎక్కడో తెలుసా?

|

Apr 12, 2022 | 5:02 PM

సాధారణంగా ఒక చెట్టుకు ఎన్ని టమాటాలు కాస్తాయి? 20 లేదా 30 పండ్లు కాస్తాయి. ఎక్కువలో ఎక్కువంటే 50 కాస్తాయి. కానీ ఒకే చెట్టుకు ఏకంగా 1,200కు పైనే పండ్లు కాసాయి.

Viral News: ఒకే చెట్టుకు 1200కు పైగా టమాటాలు.. గిన్నిస్‌ బుక్‌లో చోటు.. ఎక్కడో తెలుసా?
Douglas Smith
Follow us on

సాధారణంగా ఒక చెట్టుకు ఎన్ని టమాటాలు కాస్తాయి? 20 లేదా 30 పండ్లు కాస్తాయి. ఎక్కువలో ఎక్కువంటే 50 కాస్తాయి. కానీ ఒకే చెట్టుకు ఏకంగా 1,200కు పైనే పండ్లు కాసాయి. వినడానికి కొంచెం వింతగా ఉన్న ఇది నమ్మలేని నిజం. బ్రిటన్‌కు చెందిన ఓ గార్డెనర్‌ తోటలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ టమాటాల చెట్ల ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అంతేకాదు ఆ గార్డెనర్‌ ఏకంగా గిన్నిస్‌ వరల్డ్ రికార్డు (Guinness World Record) చోటు దక్కించుకున్నాడు. మరి ఇదెలా సాధ్యమైందో తెలుసుకుందాం రండి. బ్రిటన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన డగ్లాస్‌ స్మిత్‌ (Douglas Smith)ఐటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో పాటు మొక్కలను పెంచడం అభిరుచిగా మార్చుకున్నాడు. ప్రపంచంలో ఉత్తమ గార్డెనర్‌ కావాలన్నది అతని ఆకాంక్ష. అందుకోసం చాలా ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. అందుకే ఐటీ మేనేజర్‌గా పనిచేస్తూనే రోజుకు కనీసం 4 గంటలు తన గార్డెన్‌లోనే గడుపుతాడు.

1269 టమాటాలతో..

కాగా గతంలో ఒక చెట్టుకు అత్యధికంగా కాసిన టమాటా పండ్ల సంఖ్య 488గా ఉండేది. గతేడాది వేసవిలో స్మిత్‌ఈ రికార్డును బద్దలు కొట్టాడు. తన గ్రీన్‌హౌస్‌లోని ఒకే చెట్టుకు ఏకంగా 839 టమాటా పండ్లు కాశాయి. తాజాగా ఆయన రికార్డును మళ్లీ ఈయనే తిరగరాశాడు. తన గార్డెన్‌లోని ఓ చెట్టుకు ఈసారి ఏకంగా1,269 టమాటాలు కాశాయి. వీటిని చూసి ఉబ్బిత‌బ్బిబ్బైన స్మిత్‌ వెంట‌నే వ‌ర‌ల్డ్ రికార్డుకు ద‌ర‌ఖాస్తు చేశాడు. గిన్నిస్ వ‌ర‌ల్డ్ బుక్ రికార్డు నిర్వాహ‌కులు వ‌చ్చి ట‌మాటాల‌ను లెక్క పెట్టారు. ప‌ది, పది ట‌మాటాల‌ను ఒక్కొక్క బాక్సులో పెట్టుకుంటూ లెక్కపెట్టారు. అలా చివ‌ర‌కు ఒకే చెట్టుకు 1269 ట‌మాటాలు కాసిన‌ట్లు ధ్రువీక‌రించడంతో స్మిత్‌ పేరు గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది.

కాగా టమాట పంట సాగుకోసం ఎన్నో రీసెర్చ్‌ పేపర్లను తిరగేశాడు స్మిత్‌. గార్డెన్‌లో మొక్కలను పెంచే సాయిల్‌ శాంపిళ్లను కూడా పరీక్ష చేయించాడు. ‘ ఏ టమాటా రకంతో ఎక్కువ పండ్లు కాస్తాయో కనుగొనేందుకు చాలా ప్రయత్నించాను. ప్రయోగాలు చేశాను. సాయిల్ శాంపిల్స్‌ను పరీక్షించాను. చివరకు అనుకున్నది సాధించాను’ అంటూ తన సక్సెస్‌ సీక్రెట్‌ను షేర్‌ చేశాడు స్మిత్‌.

Also Read:Hyderabad: అడ్డంగా ఉన్నాయని నరికేస్తామంటే కుదరదు.. చెట్టుపై చేయి వేయాలంటే అనుమతి తప్పనిసరి..

Hyderabad: అడ్డంగా ఉన్నాయని నరికేస్తామంటే కుదరదు.. చెట్టుపై చేయి వేయాలంటే అనుమతి తప్పనిసరి..

Hyderabad: అడ్డంగా ఉన్నాయని నరికేస్తామంటే కుదరదు.. చెట్టుపై చేయి వేయాలంటే అనుమతి తప్పనిసరి..