
పెళ్లి వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనది. అది వధూవరులకు మరుపురాని క్షణం. సాధారణంగా, వధూవరుల నుండి అతిథుల వరకు అందరూ అందంగా ముస్తాబవుతారు, కానీ వధువు తన పెళ్లికి అందంగా ముస్తాబవ్వకుండా స్కూల్ యూనిఫాం ధరించి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి? అవును, అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి కథ తెలుసుకున్న తర్వాత నెటిజన్లు షాక్ అవుతున్నారు. వారిని అభినందిస్తున్నారు. ఈ వీడియోలో , వధువు సాంప్రదాయ లెహంగాకు బదులుగా స్కూల్ యూనిఫాం ధరించి పెళ్లి మండపంలోకి ప్రవేశించింది. వరుడు ఆమెను చూసిన వెంటనే ఆనంద బాష్పాలు కార్చారు.
వివాహ వేదిక ప్రవేశ ద్వారం గుండా ఒక యువతి లోపలికి ప్రవేశించింది. ఆమె స్కూల్ యూనిఫాం ధరించి, పూల గుత్తి పట్టుకుని ఉంది. ఆ తర్వాత ఆమె నేరుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్లింది. అక్కడ వరుడు సూట్, బూట్ ధరించి, దర్జాగా నిలబడి ఉన్నాడు. ఇంతలో వెనక్కు నిలబడి ఉన్న వరుడిని పలకరించిన యువతి అతనికి బొకే ఇచ్చింది. వచ్చింది ఎవరో చూసి వరుడు షాక్ అయ్యాడు. వెంటనే ఆనందం తట్టుకోలేక ఏడ్చేశాడు. తన వధువును స్కూల్ యూనిఫాంలో చూసినప్పుడు, అతను మొదట ఆశ్చర్యపోయాడు, కానీ తరువాత భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ అమ్మాయి వెంటనే అతన్ని కౌగిలించుకుంది. ఈ వీడియో వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ అందమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @TAdventurousoul అనే ఖాతా పేరుతో షేర్ చేశారు. “ఆమె తన పెళ్లి రోజున అతనిని ఆశ్చర్యపరిచేందుకు స్కూల్ యూనిఫామ్‌ను ధరించింది. వారు స్కూల్ నుండి ప్రేమలో ఉన్నారు” అని క్యాప్షన్ ఉంది. ఈ 24 సెకన్ల వీడియోను 3.7 మిలియన్ సార్లు వీక్షించారు, 20,000 మంది దీనిని లైక్ చేశారు. వివిధ రకాల ప్రతిస్పందనలు తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు, “తొలి ప్రేమ ఎప్పటికీ ప్రేమగా మారినప్పుడు… అది ఏ సినిమా కంటే మెరుగ్గా అనిపిస్తుంది.” అని రాశారు. మరొకరు, “ఇది కేవలం ప్రేమ కాదు… ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.” అని పేర్కొన్నారు.
వీడియోను ఇక్కడ చూడండిః
She wore her school dress on her wedding day to surprise him… They've been in love since school days 😭❤️ pic.twitter.com/zZ17gnz87g
— The Adventurous Soul (@TAdventurousoul) February 20, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..