Viral Video: వధువును ఇంప్రెస్‌ చేయడానికి వరుడి ప్రయత్నం.. హృతిక్‌ రోషన్‌ అంటున్న నెటిజనం

|

Dec 19, 2022 | 4:51 PM

వైరల్ అవుతున్న వీడియోలో వరుడు తన వివాహం సందర్భంగా వధువును ఆకట్టుకునే ప్రయత్నంలో వేదికపై అద్భుతంగా డాన్స్‌ చేశాడు. అతను ఘుంగ్రూ అనే పాటకు ఎంతో అందంగా స్టెప్స్‌ వేస్తుండటంతో బంధు మిత్రులంతా ముగ్ధులైపోయారు

Viral Video: వధువును ఇంప్రెస్‌ చేయడానికి వరుడి ప్రయత్నం.. హృతిక్‌ రోషన్‌ అంటున్న నెటిజనం
Groom Dance Video
Follow us on

పెళ్లిళ్ల సీజన్ మొదలైతే చాలు.. రకరకాల వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే.. గత కొంతకాలంగా వివాహ వేడుక ఒక ట్రెండ్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిరోజు ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లి వేడుకలో సంగీత్‌ కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతకాలంలో ఈ సంగీత్‌ కార్యక్రమం కొత్త పుంతలు తొక్కుతోంది. వధూవరులే తమ వివాహ వేడకలో అద్భుతంగా డాన్స్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో వరుడు తన వివాహం సందర్భంగా వధువును ఆకట్టుకునే ప్రయత్నంలో వేదికపై అద్భుతంగా డాన్స్‌ చేశాడు. అతను ఘుంగ్రూ అనే పాటకు ఎంతో అందంగా స్టెప్స్‌ వేస్తుండటంతో బంధు మిత్రులంతా ముగ్ధులైపోయారు. అంతేకాదు వరుడి చుట్టూ చేరి హృతిక్‌ రోషన్‌ అంటూ చప్పట్లతో ఎంకరైజ్‌ చేశారు. దాంతో మరింత ఉత్సాహంగా డాన్స్‌ చేశాడు వరుడు.

ఇవి కూడా చదవండి

కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను దాదాపు 5 వేలమందికి పైగా వీక్షిస్తూ లైక్‌ చేశారు. ఇంకా తమదైనశైలిలో కామెంట్లు చేస్తూ హోరెత్తించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..