ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్, ప్రీ వెడ్డింగ్ వేడుకలు ట్రెండ్‌గా మారాయి. అలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇలాంటి వేడుకల్లో ఎన్నో సరదా ఘటనలు జరుగుతుంటాయి. అవి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరలై నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ జంట ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నూతన వధూవరులు అందంగా ముస్తాబై స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్నారు. ఎంతో రొమాంటిక్‌గా డాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుడు అనుకోకుండా వధువు లెహంగాను తొక్కేస్తాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. జైపూర్ ప్రీ వెడ్డింగ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోను చూసిన వేలాదిమంది నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అలాగే నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.