ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్ సరఫరా చేస్తున్న బ్రెజిల్ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆమెను ఆరా తీయడంతో పాటు క్షేత్ర స్థాయిలో పరీక్షలు చేయగా, ఆ మహిళ శరీరంలో 973గ్రాముల కొకైన్‌తో కూడిన 124క్యాప్సూల్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కొకైన్‌గా భావించబడే పదార్థాన్ని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్ధాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లోని ఇతర సభ్యుల జాడ కోసం విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సావో పాలో నుండి దిగిన ఆ మహిళను అడ్డగించారని DRI ముంబై జోనల్ యూనిట్ అధికారి తెలిపారు.
ఈ పోస్ట్ పై క్లిక్ చేయండి..
DRI, Mumbai Zonal Unit, intercepted a Brazilian female National who had arrived at the Mumbai Airport from Sau Paulo on September 18. On questioning, the passenger admitted to having ingested capsules containing 973 grams of cocaine, valued at Rs. 9.73 Crores in the illicit…
— ANI (@ANI) September 22, 2024
డ్రగ్స్‌తో ఫీల్ చేసిన క్యాప్సూల్స్‌ను మహిళ తన శరీరంలోకి తీసుకుని భారత్‌లోకి వచ్చినట్లు ఆమె అంగీకరించిందని అధికారులు పేర్కొన్నారు. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఆ తర్వాత జేజే ఆస్పత్రిలో చేర్చారు. ఆమె అక్రమ మార్కెట్‌లో 9.73 కోట్ల రూపాయల విలువైన 973 గ్రాముల కొకైన్‌ను కలిగి ఉన్న 124 క్యాప్సూల్స్‌ను మింగేసిందని అధికారి తెలిపారు. ప్రయాణికురాలిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ఎయిర్ పోర్టులో భద్రతపై ఎంత పటిష్ట చర్యలు చేపట్టినప్పటికీ పలుమార్లు ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అక్రమ ధనార్జనే ధ్యేయంగా కొందరు కేటుగాళ్లు మత్తు పదార్థాలు, నిషేద్ధిత వస్తువులను అధికారుల కళ్లు గప్పి అక్రమ మార్గాల్లో దేశాలు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఎక్కడో ఒక చోట నిందితుల వ్యవహరం బట్టబయలు కావడంతో వారి కుట్రలకు అడ్డుకట్టినట్టుగా అవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..