Viral Video: బాబోయ్! మొసలితోనే పరాచకాలా.. పిల్లి చేసిన పనికి అంతా షాక్.. వీడియో చూస్తే అవాక్కే!

|

Mar 22, 2022 | 7:50 AM

సాధారణంగా మొసలిని దూరం నుంచి చూస్తేనే భయపడిపోతుంటాం. అలాంటిది దాని దగ్గరకు వెళ్లాలంటే.? ఇంకేమైనా ఉందా.? గుండె ఆగిపోయినట్లే..

Viral Video: బాబోయ్! మొసలితోనే పరాచకాలా.. పిల్లి చేసిన పనికి అంతా షాక్.. వీడియో చూస్తే అవాక్కే!
Cat Vs Crocodile
Follow us on

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని షాక్‌కు గురయ్యేలా చేస్తాయి. ఇప్పుడు ఇదే కోవకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా మొసలిని దూరం నుంచి చూస్తేనే భయపడిపోతుంటాం. అలాంటిది దాని దగ్గరకు వెళ్లాలంటే.? ఇంకేమైనా ఉందా.? గుండె ఆగిపోయినట్లే.. అయితే ఇక్కడొక పిల్లి ఏకంగా తన ఆహారం కోసం మొసలితో యుద్ధం చేసేంత పని చేసింది. చివరికి ఏం జరిగిందంటే…

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ సరస్సు దగ్గరలో మొసలి ఎంచక్కా సేద తీరుతోంది. ఇక దాని నోటి ముందు ఓ చేప పడి ఉంది. చేపలను చూస్తే చాలు పిల్లుల నోరు ఊరుతుంది. ఇంకేముంది ఇక్కడ కూడా ఓ పిల్లి.. తనకిష్టమైన ఆహారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని.. మొసలితో యుద్దానికైనా సిద్దమంటూ.. నెమ్మదిగా దొంగలా మొసలి దగ్గరకు వెళ్తుంది. ఒక కంటితో మొసలిని గమనిస్తూనే.. మరో కంటితో చాకచక్యంగా తన చేప ముక్కను నోట కరుచుకుని చటుక్కున అక్కడ నుంచి జారుకుంటుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి..

కాగా, ఈ వైరల్ వీడియోను ‘nature27_12’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘బ్రేవ్ క్యాట్’ అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేసింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 3 వేలకు పైగా లైకులు రాగా.. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. పిల్లి ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.