షోరూమ్‌ నుంచి అప్పుడే ఇంటికి వచ్చిన కొత్త కారు.. అంతలోనే ఊహించని సంఘటన.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకుంటే..

|

Oct 09, 2022 | 8:23 AM

కొత్త కారు కొనుగోలు చేస్తే ఆ సంతోషం మాములుగా ఉండదు. షోరూమ్‌ నుంచి కారును ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఫుల్‌ జోష్‌తో ఉంటారు. ఇంట్లో ఉన్న వారికి తమ కారును తొలిసారి చూపించాలని తెగ ఆరాటపడుతుంటారు. అయితే ఊహించని సంఘటన..

షోరూమ్‌ నుంచి అప్పుడే ఇంటికి వచ్చిన కొత్త కారు.. అంతలోనే ఊహించని సంఘటన.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకుంటే..
Car Viral Video
Follow us on

సోషల్‌ మీడియాలో విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రతీ చిన్న అంశం వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా నెట్టింట రోజుకో కొత్త వీడియో చక్కర్లు కొడుతోంది. సీసీకెమెరాల వినియోగం పెరగడం, ఆ వీడియోలు సులభంగా సేవ్‌ చేసుకునే వెసులుబాటు ఉండడంతో వీడియోలను తెగ వైరల్‌ చేసేస్తున్నారు. ఈ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని అవాక్కయేలా చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది.

కొత్త కారు కొనుగోలు చేస్తే ఆ సంతోషం మాములుగా ఉండదు. షోరూమ్‌ నుంచి కారును ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఫుల్‌ జోష్‌తో ఉంటారు. ఇంట్లో ఉన్న వారికి తమ కారును తొలిసారి చూపించాలని తెగ ఆరాటపడుతుంటారు. ఇంట్లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్‌ చేయాలని భావిస్తుంటారు. ఓ వ్యక్తి కూడా ఇలాగే తన కొత్త కారును ఇంటికి గ్రాండ్‌గా తీసుకురావాలని ప్లాన్‌ చేశాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరోటి తలిచినట్లు జరిగింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

కొత్త కారుతో ఇంటి గేట్‌లోకి బాగానే ఎంట్రీ ఇచ్చాడు సదరు యజమాని. అయితే ఆ తర్వాతే ఒక్కసారి కారు అదుపు తప్పింది. బహుశా బ్రేక్‌ వేయాల్సి ఉండి, ఎస్కలేటర్‌ను నొక్కినట్లు ఉన్నాడు. దీంతో కారు ఒక్కసారిగా అక్కడ పార్క్‌ చేసిన బైక్‌లపైకి దూసుకుపోయింది. అక్కడితో ఆగకుండా కారు బోల్తా కొట్టింది. అయితే అక్కడున్న వారు వెంటనే కారు వద్దకు చేరుకొని సహాయం చేయడంతో కారు పూర్తిగా కింద పడకుండా కాపాడగలిగారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..