Puzzle: ఈ ఫోటోలో తోడేలు కనిపెట్టాలంటే తల ప్రాణం తోకకు వచ్చుద్ది.. మీకే సవాల్..!

|

Jun 13, 2022 | 1:37 PM

Viral Photo: ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ కఠినమైన ఫోటో పజిల్.

Puzzle: ఈ ఫోటోలో తోడేలు కనిపెట్టాలంటే తల ప్రాణం తోకకు వచ్చుద్ది.. మీకే సవాల్..!
Find The Wolf
Follow us on

Challenging Quiz: పజిల్ గురూ పజిల్.. మీ కోసం అచ్చా.. ఇంకా చెప్పాలంటే మీరు మెచ్చే ఫోటో పజిల్ తీసుకొచ్చాం. డామ్ షూర్.. ఈ పజిల్ మిమ్మల్ని పక్కాగా తికమకపెడుతుంది. మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆన్సర్ చూశాక అరెరె… ఇదెలా మిస్సయ్యాం అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రోజూ లెక్కించలేనన్ని ఫోటోలు కెమెరాలో బంధించబడతాయి. వీటిలోని కొన్ని ఫోటోలు చాలా మిస్టరీగా అనిపిస్తాయి. కొన్ని ఫోటోలు మీ ఐ పవర్ టెస్ట్ చేస్తాయి. మేధావులం అనుకునే వాళ్ల చేత కూడా కొన్నిసార్లు తలలు పట్టుకునేలా చేస్తాయి. ఆ కేటగిరీకి చెందినవే ఆప్టికల్ ఇల్యూషన్(Optical illusion) ఫోటోస్.  తాజాగా అలాంటి ఫోటోనే మీ ముందుకు తెచ్చాం. ఇది ఓ అటవీ ప్రాంతంలో తీసినదిగా అర్థమవుతుంది. ఈ ఫోటోలో ఓ తోడేలు నక్కి ఉంది. దాన్ని కనిపెట్టాలంటే మీ తల ప్రాణం తోకకు రావాల్సిందే. చాలా కన్‌ఫ్యూజింగ్ పజిల్ ఇది.  మీ ఐ పవర్ అద్భుతంగా ఉంటే వీటిని తక్కువ సమయంలోనే ఆ తోడేలు కనిపెట్టవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ప్రయత్నించండి. నిశితంగా గమనిస్తే.. దాన్ని తక్కువ సమయంలోనే పట్టేయవచ్చు. పైపైన ఏదో రఫ్‌గా గమనిస్తే మాత్రం అది దొరకదు. ఎంత చూసినా మాకు దొరకడం లేదు.. ఇక కష్టం అనిపిస్తే దిగువన ఫోటో చూడండి.

చూశారుగా ఇప్పుడు అనిపిస్తుంది కదా.. అబ్బా ఇది కనిపెట్టలేకపోయాం ఏంటి అని.. అందుకే కాస్త పేషెన్స్‌తో చూడమన్నది. ఏం పర్లేదు లెండి.. నూటికి 90 శాతం మంది ఈ తోడేలు కనిపెట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ సారి ఫోటో పజిల్ ఇచ్చినప్పుడు మాత్రం కాస్త  ఫోకస్ పెట్టి చూడండి. విజయం మీదే.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..