Brain Teaser: ఈ ఫోటోలో 3 సంఖ్య ఎన్ని చోట్ల ఉంది.. 20 సెకన్లలో ఆన్సర్ ఇవ్వగలరా.. ఈజీ అయితే కాదు

|

Jul 31, 2022 | 5:38 PM

ఈ ఫోటోల పజిల్‌లో, మొబైల్ స్క్రీన్ ఇమేజ్‌లో 3 సంఖ్య ఎన్ని చోట్ల దాగి ఉందో కనిపెట్టాలి. మీరు ఈ చిక్కు ప్రశ్నకు 20 సెకన్లలో సమాధానం ఇవ్వగలరా..?

Brain Teaser: ఈ ఫోటోలో 3 సంఖ్య ఎన్ని చోట్ల ఉంది.. 20 సెకన్లలో ఆన్సర్ ఇవ్వగలరా.. ఈజీ అయితే కాదు
Brain Teaser Puzzle
Follow us on

Optical Illusion Puzzles: ఆప్టికల్ ఇల్యూజన్ ఇమేజస్ లేదా బ్రెయిన్ టీజర్ ఇమేజస్ మీరు చాలా చూసి ఉంటారు. ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు మన కళ్లు మనల్నే చీట్ చేస్తాయి. అక్కడ ఉన్నదాన్ని గుర్తించడంలో మనం విఫలం అవ్వడమో, తప్పుగా అంచనా వేయడమో జరుగుతుంది. ఈ మధ్య ఇలాంటి చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో(Social media) ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చిక్కుముళ్లలా ఉండి మనతో గేమ్ ఆడుతాయి. ఇవి మన బ్రెయిన్ ఎంత క్విక్‌గా వర్క్ చేస్తుందో, మనలో సృజనాత్మక ఎంతో ఉందో చెప్పేస్తాయి. ఈ చిక్కులను పరిష్కరించేటప్పుడు, మీరు కాస్త క్రియేటివ్‌గా ఆలోచించాలి. ఔట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయాలి. తాజాగా మీ ముందుకు ఓ చక్కటి బ్రెయిన్ టీజర్ ఇమేజ్‌తో మీ ముందుకు వచ్చాం. ఇందులో మీరు మొబైల్ డయలింగ్ స్క్రీన్ ఇమేజ్‌లో 3 నంబర్స్ ఎన్ని ఉన్నాయో లెక్కించాలి.  అది కూడా  కొద్ది సమయంలోనే. మనస్సును లగ్నం చేస్తే మీరు.. 20 సెకన్లలోనే ఈ చిక్కుముడిని విప్పగలరు. సమాధానం చాలా సులభమైనది.. గమ్మత్తైనది. కనుక ప్రశ్నకు సమాధానమిచ్చే ముందు మీరు ఫోటోను మరోసారి జాగ్రత్తగా చూడండి. ఏంటి వెంటనే కన్‌క్లూజన్‌కి వచ్చారా..? ఆగండి మీరు పప్పులో కాలేశారని అర్థమవుతుంది. మీకు క్లూ ఏంటంటే.. 3 నంబర్ డయలింగ్ ప్యాడ్‌పైనే కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా దాగి ఉంది. ఏంటి ఇంకా ఒక స్పష్టతకు రాలేకపోతున్నారా అయితే ఆన్సర్ మేమే చెప్పేస్తాం లెండి.

ఫోటోలో మీరు మొబైల్ డయలింగ్ ప్యాడ్, కాంటాక్ట్ నేమ్, టూమ్, బ్యాటరీ లెవల్‌తో పాటు టైప్ చేసిన నంబర్స్‌లో కూడా ఉన్న 3 సంఖ్యలను లెక్కించాలి.

ఇప్పుడు చిత్రంలో దాగి ఉన్న 3 సంఖ్యలను లెక్కిద్దాం పదండి

  • టైమ్ వద్ద మూడు 3 సంఖ్యలు ఉన్నాయి
  • బ్యాటరీ లెవల్ వద్ద రెండు 3 సంఖ్యలు ఉన్నాయి
  • మొబైల్ నంబర్‌లో ఎనిమిది 3 సంఖ్యలు ఉన్నాయి
  • కాంటాక్ట్ నేమ్‌లో మూడు 3 సంఖ్యలు ఉన్నాయి
  • డయలింగ్ ప్యాడ్‌లో మూడు 3 సంఖ్యలు ఉన్నాయి

కాబట్టి, పజిల్‌కు ఆన్సర్ “19”అంటే ఇచ్చిన ఇమేజ్‌లో మొత్తం మూడు సంఖ్య మొత్తం 19 చోట్ల ఉంది. తక్కువ సమయంలో మీరు ఆన్సర్ పసిగట్టినట్లయితే మీరు తోపు అంతే.

Puzzle

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..