Viral Video: పాము పుట్టకు సమీపంలో ఫోన్ పెట్టి నాగినీ ట్యూన్ ప్లే చేశారు.. కాసేపటికి..

సోషల్ మీడియాలో లైక్స్ పిచ్చి ఏం చేస్తుందిరా అంటే.. ఇదిగో పాపం వన్యప్రాణులను కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు అని చెప్పవచ్చు. రోజుకో వెర్రి వేషం వేస్తూ సోషల్ మీడియాలో ఫేమ్ పొందాలని కొందరు పాకులాడుతున్నారు. తాజాగా ఈ కుర్రాళ్లు ఓ తింగరి పని చేశారు.

Viral Video: పాము పుట్టకు సమీపంలో ఫోన్ పెట్టి నాగినీ ట్యూన్ ప్లే చేశారు.. కాసేపటికి..
Snake

Updated on: May 28, 2025 | 8:01 AM

మీరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అయితే మీ ఊరికి పాములను ఆడించేవాళ్లు వస్తూనే ఉంటారు. పొట్ట పోసుకునేందుకు వాళ్లు బూర ఊదుతూ పాములను ఆడిస్తూ ఉంటారు. అయితే అవన్నీ పాత రోజులు.. ఇప్పుడు సోషల్ మీడియా వెర్రి వేషాలు వేస్తుంది కదా.. మొబైల్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాముల ఆవాసాలు అవేనండీ పుట్టల వద్దకు వెళ్లి.. ఆ ఫోన్లనో నాగిని ట్యూన్స్ పెట్టి పాములను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

కొంతకాలం క్రితం ఓ వీడియోలో కొంత మంది బీహారీ అబ్బాయిలు ఇలానే ప్రయత్నించగా, ఆ వీడియో ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో కొత్త వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో కొంత మంది అబ్బాయిలు.. పామును పుట్ట నుంచి బయటికి తీసేందుకు.. మొబైల్‌లో నాగిని ట్యూన్ ప్లే చేశారు. పుట్ట సమీపంలోని చెట్టు వద్ద ఫోన్‌ ఉంచి.. ఆ ట్యూన్ ప్లే చేశారు. సమీప ప్రాంతాల్లో పుట్టను రికార్డు చేసేలా మరో ఫోన్ పెట్టారు. కాసేపటికి ఆశ్చర్యకర రీతిలో కాసేపటికి పాము బయటికి వచ్చి.. ట్యూన్‌కు అనుగుణంగా కదలడం వీడియోలో రికార్డు అయింది. ఈ వీడియోను @smarty___boy__057 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మే 7న పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియోకి కోటిన్నర వ్యూస్, లక్షల లైక్స్ వచ్చాయి.

వీడియో దిగువన చూడండి.. 

ఇక వీడియోకు కామెంట్స్ అయితే ఓ రేంజ్‌లో వస్తున్నాయి. “మన భారత దేశంలో ఇంత తెలివైన వాళ్లు ఉన్నారంటే గర్వంగా ఉంది!”, “మీ సోషల్ మీడియా పిచ్చి తగలెయ్య.. వాటిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు కదారా !” అంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు.

పాములు శబ్దాలను వినలేవు.. అవి భూమి ద్వారా వచ్చే వైబ్రేషన్లను మాత్రమే గుర్తించగలవు. బూర ఊదేటప్పుడు.. కదలికలను చూసి పాములు తన శరీరాన్ని కదిలిస్తాయి. అంతే కానీ ఇలా ఏం ఉండదు.. ఇది ఓ కల్పిత వీడియో అని నిపుణులు కొట్టిపారేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..