
తాజాగా ఒక హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే, ఒక్కసారిగా ఒళ్లు గుగుర్పాటుకు గురి చేసినంత పనైంది. ఒక యువకుడు తన స్నేహితుల సమక్షంలో తన గర్ల్‌ఫ్రెండ్ పట్ల ఉన్న ప్రేమను ఒక ప్రత్యేకమైన స్టంట్ ద్వారా తెలియజేయాలనుకున్నాడు. తన ప్రేయసిని తన భుజంపైకి ఎక్కించుకుని తన ఆనందాన్ని వ్యక్తపరచాలనుకున్నాడు. కానీ ఈ ఒక చిన్న తప్పు అతని జీవితాన్ని మారుస్తుందని ఊహించలేకపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
ఒక ఇంటి హాలులో స్నేహితుల బృందం కలిసి ఓ జంట కూర్చుని ఉంది. టీవీ ఆన్‌లో ఉంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఇంతలో, ఒక యువకుడు తన స్నేహితురాలితో సరదాగా కనిపిస్తూ వచ్చాడు. ఆమె పట్ల తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడు. ఆమె తన భుజాలపై కూర్చొబెట్టుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను తన చేతుల్లోకి ఎత్తడానికి బదులుగా, అతను ఒక వింతైన రివర్స్ స్టంట్ కోసం ప్రయత్నించాడు. ఆమెను తలక్రిందులుగా చేసి తన భుజాలపై వేసుకోవాలని అనుకుంటాడు.
ప్రియురాలిని తన భుజంపైకి ఎత్తి, ఆపై పైకి లేపుతుండగా, అతని బ్యాలెన్స్ అకస్మాత్తుగా చెదిరిపోతుంది. అమ్మాయి మొత్తం బరువు మోయలేక కుప్పకూలిపోయారు. కొన్ని సెకన్లలో, ఆ యువకుడు తడబడి ముందు గోడ, వెనుక కిటికీ వైపు పడిపోయాడు. యువకుడి భుజంపై ఉన్న అమ్మాయి మొత్తం శరీర బరువు నేరుగా అతని మెడపై వెన్నెముకపై పడటంతో.. అత్యంత భయానక దృశ్యంగా మారిపోయింది. మెడ ఎముక విరిగి కేకలు వేయడంతో ఆ ప్రాంతం విషాదంగా మారిపోయింది.
ఈ వీడియోలో ఆ యువకుడి మెడ ఒక్క క్షణంలో మెలితిరిగిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న స్నేహితులు మొదట్లో అది సాధారణగా భావించి నవ్వారు, కానీ ఆ యువకుడి పరిస్థితిని చూసి భయపడ్డారు. అతను కదలలేకపోయాడు. దీంతో అతన్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే అతని మెడ విరిగిపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు చెబుతున్నారు. @NeverteIImeodd అనే ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు. చాలామంది దీన్ని లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారుడు “సోదరా, దెబ్బకు దయ్యం వదిలింది” అని రాశారు. మరొకరు “అతను మళ్ళీ ఎప్పటికీ ప్రేమలో పడడు” అని రాశారు. మరొక వినియోగదారుడు “నువ్వు ప్రేమికురాలిగా మారుతావా?” అని రాశారు.
షాకింగ్ వీడియోను ఇక్కడ చూడండి..:
— Second before disaster (@NeverteIImeodd) March 7, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…