Funny Stunt Video: సోషల్ మీడియా ప్రపంచంలో కొత్తదనాన్ని ట్రై చేస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు చాలామంది రకరకాల ప్రయత్నాలు, విన్యాసాలు చేస్తుంటారు. మీడియాలో స్టంట్స్ కు సంబంధించిన వీడియోలను మనం తరచూ చూస్తుంటాం.. వాస్తవానికి ఇలాంటి విన్యాసాలు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అయితే కొంతమంది స్టంట్స్ చేస్తూ ఇబ్బందుల్లో పడుతుంటారు.. అయితే.. ఇదే ట్రేండ్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా పాకింది. వారు కూడా రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపిస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని విన్యాసాలు విఫలమైనప్పటికీ.. పట్టుదలతో ప్రయత్నిస్తూ విజయవంతం అవుతున్నారు. అయితే.. ఇలాంటి సందర్భంలో స్టంట్ ఫేయిల్ అయిన వీడియోలు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఓ యువకుడు స్టంట్ చేస్తూ ప్రమాదంలో పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.
వీడియోలో ఒక కుర్రాడు హీరోలాగా స్టంట్ చూపించడానికి ప్రయత్నించాడు.. కానీ అతని స్టంట్ విఫలమైనప్పుడు.. దీంతో అతను ఘోరంగా కిందపడ్డాడు. ఈ వీడియోలో ఒక మంచం నిలబెట్టి ఉంది. ఆ మంచం మీద నుంచి దూకాలని యువకుడు ప్రయత్నిస్తాడు.ఈ క్రమంలో అతని కాళ్లు మంచి చివరన తగలుతాయి. దీంతో అతను కిందపడతాడు. అదే సమయంలో అతని తల కూడా భూమికి తాకుతుంది. కింద పడిన విధానం చూస్తుంటే.. అతను గాయపడ్డాడని అర్ధమవుతోంది.
వైరల్ వీడియో..
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రీట్సో2 అనే యూజర్ షేర్ చేయగా.. ఇప్పటివరకు 8.5 మిలియన్ల మంది వీక్షించారు. దీంతోపాటు 4 లక్షల 79 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: