Viral Video: అమ్మబాబోయ్! వీడు అసాధ్యుడు.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే డ్యాన్స్ చేశాడు.. షాకింగ్ వీడియో

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. ఓవర్ నైట్ స్టార్స్ కావడానికి చాలామంది వ్యక్తులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు...

Viral Video: అమ్మబాబోయ్! వీడు అసాధ్యుడు.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే డ్యాన్స్ చేశాడు.. షాకింగ్ వీడియో
Snake

Edited By: Phani CH

Updated on: Nov 08, 2021 | 5:49 PM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. ఓవర్ నైట్ స్టార్స్ కావడానికి చాలామంది వ్యక్తులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కొంతమంది అయితే లైకులు, ఫాలోవర్స్‌ను సంపాదించుకునేందుకు గగుర్పాటుకు గురి చేసేలా పాములతో సయ్యాటలాడుతూ.. ముద్దులు పెడుతూ స్టంట్స్ చేసి.. వాటిని వీడియోలుగా అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇవి వికటిస్తే.. ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. ఇక ఆ కోవకు చెందిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇంట్లోకి ప్రవేశించిన భారీ కింగ్ కోబ్రాను ఓ యువకుడు పట్టుకున్నాడు. ఇక ఆ పాముతో కలిసి అతడు డ్యాన్స్ చేశాడు. అతగాడు చేసిన ఆ డ్యాన్స్‌ను ఇద్దరు చిన్నారులు పక్కనే నిల్చొని చూస్తున్నారు. ఆ యువకుడు డ్యాన్స్ చేసినంత సేపు.. కింగ్ కోబ్రా అతడిని ఏం చేయకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘helicopter_yatra’ అనే పేజి పోస్ట్ చేసింది. ఇప్పటివరకు దీనికి 2.48 లక్షల లైకులు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అసలు అది పామనుకున్నడా.. లేక బొమ్మ అనుకున్నాడా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘నా కళ్లను నేను నమ్మలేకపోతున్నా’ అంటూ మరొకరు.. ‘ఇదొక రకమైన పిచ్చి’ అంటూ వేరొకరు కామెంట్ చేశారు.

Also Read:

Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో

Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఫన్నీ.. అవి ఏయే రాశులో మీరే చూసేయండి!

అడవి కుక్కలను తప్పించుకోబోయి మొసలికి చిక్కిన జింక.. వీడియో చూస్తే షాకవుతారు!

ఈ 4 పండ్ల కాంబినేషన్‌ చాలా డేంజర్.! వీటిని కలిపి తినొద్దు.! అవేంటో తెలుసా..