King Cobra: కింగ్‌కోబ్రాను ఈ కుర్రాడు ఎలా పట్టుకున్నాడో చూస్తే షాకవుతారు.. వీడియో వైరల్‌

సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు కనిపిస్తుంటాయి. ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. ముఖ్యంగా పాములు, పులులు,సింహాలు..

King Cobra: కింగ్‌కోబ్రాను ఈ కుర్రాడు ఎలా పట్టుకున్నాడో చూస్తే షాకవుతారు.. వీడియో వైరల్‌
King Cobra
Follow us

|

Updated on: Oct 06, 2022 | 9:12 PM

సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు కనిపిస్తుంటాయి. ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. ముఖ్యంగా పాములు, పులులు,సింహాలు, మొసళ్లు, ఇతర జంతువులకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని వీడియోలు షాక్‌కు గురి చేసేలా ఉంటే..మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇక పాములు ప్రపంచంలోని అత్యంత భయంకరమైన జీవులలో ఒకటి. అందులో కింగ్ కోబ్రా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. కింగ్ కోబ్రా కాటేస్తే దాని విషం తక్షణమే నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అది కాటేస్తే కేవలం15 నిమిషాల్లో మనిషి ప్రాణాలు పోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కింగ్ కోబ్రా కాటు ఏనుగును కూడా చంపగలదు.

అందుకే విషపూరితమైన పాములు ఎదురైతే చాలా మందికి వణుకు పుడుతుంది. ఆ విషయం కంటి చూపును కోల్పోయేలా చేస్తుందట. ఇక ఇలాంటి ప్రమాదకమైన పాములను పట్టాలంటే ధైర్యం కావాలి. అందులో ట్రిక్‌ ఉండాలి. లేకపోతే కాటేసే ప్రమాదం ఉంటుంది. చాలా మంది పాములను సులభంగా పట్టేస్తారు. ఇక్కడ కనిపించే వీడియోలో ఓ కింగ్‌ కోబ్రోను ఓ వ్యక్తి సులభంగా పట్టేస్తాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంటి ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రో పడుతుండటం చూసి షాక్‌కు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా ఓ కుర్రుడు కింగ్ కోబ్రాను తోకతో పట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను తమ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన తర్వాత ఈ వీడియో 155k పైగా వ్యూస్ రాగా, 3,117 లైక్‌లు వచ్చాయి. పామును పట్టిన సదరు వ్యక్తి ధైర్యాన్ని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక భూమి మీద సుమారు 3,000 జాతుల పాములు నివసిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి