Viral News: కాలుజారి కిందపడిపోయిన మహిళ.. రెస్టారెంట్‌పై రూ.41లక్షల పరిహారం డిమాండ్‌..

|

Aug 18, 2023 | 10:05 AM

అక్టోబర్ 7, 2022న షాంపిల్‌ఫుడ్‌ సప్లై చేసే రెస్టారెంట్‌లోని ఒక ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఆమె కిందపడి చీలమండ ఫ్రాక్చర్ అయింది. ఆగస్టు 11న దాఖలు చేసిన దావాలో, రెస్టారెంట్ సరిగ్గా శుభ్రం చేయలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ దంపతులు పేర్కొన్నారు. రెస్టారెంట్‌ ఫ్లోర్‌పై పడిపోయిన ఆహారం కారణంగా పలువురు ప్రజలు కిందపడిపోయారని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే

Viral News: కాలుజారి కిందపడిపోయిన మహిళ.. రెస్టారెంట్‌పై రూ.41లక్షల పరిహారం డిమాండ్‌..
Restaurant
Follow us on

సరిగా లేని చెప్పులు, బూట్ల కారణంగా తరచూ ప్రజలు పడిపోవడం చూస్తుంటాం. కొందరు నడుస్తూ నడుస్తూ ఏదో తగిలి పడిపోవటం కూడా జరుగుతుంది. ఒక్కోసారి నేల నునుపుగా ఉండడం వల్ల కూడా కాలు జారి పడిపోతుంటారు. అలా పడిపోయిన వారి గాయపడటం, కొందరు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంటారు. కొందరు చనిపోతుంటారు కూడా. అయితే, అలా ప్రమాదవశాత్తు కిందపడిపోయిన వారు..ఎవ్వరూ ఎవరి దగ్గరా పరిహారం అడగరు. అయితే ఓ మహిళ అదే పని చేసింది. ఓ మహిళ రెస్టారెంట్‌లో జారి పడి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె చికిత్స కోసం దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దాంతో ఆ మహిళ రెస్టారెంట్‌పై దావా వేసింది. రూ. 41 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

రెస్టారెంట్‌పై కేసు పెట్టారు..

బోస్టన్‌లోని ఓ రెస్టారెంట్‌లో జారి పడిపోవడంతో 67 ఏళ్ల ఎలిస్ కోహిన్ తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమె ఇప్పుడు తన భర్త రోనాల్డ్ కోహిన్‌తో కలిసి రెస్టారెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంది. రెస్టారెంట్‌లో జారిపడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడినట్టుగా చెప్పింది. దాంతో తన జీవితంలో ఆనందాన్ని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పైగా వైద్య ఖర్చులు కూడా భారంగా మారాయని చెప్పింది. దీంతో ఆమె రెస్టారెంట్‌పై దావా వేసింది. బోయిల్‌స్టన్ స్ట్రీట్ 800 బ్లాక్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి

నడుచుకుంటూ వెళ్తున్న మహిళ జారిపడింది..

కోహెన్ అక్టోబర్ 7, 2022న షాంపిల్‌ఫుడ్‌ సప్లై చేసే రెస్టారెంట్‌లోని ఒక ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఆమె కిందపడి చీలమండ ఫ్రాక్చర్ అయింది. ఆగస్టు 11న దాఖలు చేసిన దావాలో, రెస్టారెంట్ సరిగ్గా శుభ్రం చేయలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ దంపతులు పేర్కొన్నారు. రెస్టారెంట్‌ ఫ్లోర్‌పై పడిపోయిన ఆహారం కారణంగా పలువురు ప్రజలు కిందపడిపోయారని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే కిందపడిపోయిన 67ఏల్ల ఎలిస్‌ కోహిన్‌ వైద్యం కోసం రూ 6 లక్షల రూపాయలు ఖర్చు చేసిన నష్టపోయామని కోర్టుకు తెలిపారు.

రూ.6లకలు దాటిన ఆస్పత్రి బిల్లు..

స్టారెంట్‌లో జారి పడిపోవడంతో కోహెన్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆమె మెడికల్ బిల్లు $7,500 (రూ. 6 లక్షలు) దాటింది. అటువంటి పరిస్థితిలో రెస్టారెంట్‌పై దంపతుల విషయంలో సుమారు $ 50,000 (రూ. 41 లక్షలు) నష్టపరిహారం కోరింది. కోర్టు తీర్పు మేరకు.. మసాచుసెట్స్‌లో, ఎవరైనా ఇంత తీవ్రమైన గాయాలతో బాధపడినా, అది మీ జీవితాన్ని వ్యక్తిగతంగా ప్రభావితం చేస్తే’ కన్సార్టియం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తీర్పునిచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..