Dancing Robots: రోబోలు వివిధ రకాలుగా తయారవుతూ.. మనకు సేవలందిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఈరోబోల వాడకం మరింత పెరిగిపోయింది. ఆస్పత్రుల నుంచి రెస్టారెంట్స్ వరకు రోబోలను వాడుతున్నారు నిర్వాహకులు. ఇక తాజాగా అలాంటి ఓ రోబోనే నెటిజన్లను ఆకట్టుకుంటుంది. బోస్టన్ డైనమిక్స్ సంస్థ సృష్టించిన రోబో.. అచ్చం మనిషి మాదిరిగానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎగరడం, ఎత్తైన గొడలను దూకుతూ.. ఔరా అనిపిస్తున్నాయి రోబోలు.
అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబోలు ఇప్పటికే సింగపూర్ పార్క్‌లు, విధుల్లో చేరి కరోనా సమయంలో భౌతిక దూరం పాటించాలంటూ ప్రజలను చైతన్యం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే సంస్థ.. మరికొన్ని రోబోలకు ప్రాణం పోస్తోంది.
అచ్చం మనుషుల్లా ఫీట్లు చేస్తున్న రెండు రోబోల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బోస్టన్ డైనమిక్స్ సంస్థ. ఈ రోబో.. 86 కిలోల బరువు, 5 ఫీట్ల పొడవుతో ఉంది. హైడ్రాలిక్స్, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్లను ఈ రోబోలో ఉపయోగించారు. ఇక నియంత్రణల విషయానికొస్తే, ఇది మూడు ఆన్‌బోర్డ్ కంప్యూటర్లను కలిగి ఉంది. ఈ రోబోలు.. బ్యాక్ ఫ్లిప్స్ చేస్తూ అదరగొడుతుంది.
Video:
Also read:
Taj Mahal: పండు వెన్నెల్లో పాలరాతి అపురూపం.. రాత్రి సమయాల్లో తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్
Raksha Bandhan 2021: అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తు రాఖీ పండుగ.. స్పెషల్ మెహందీ డిజైన్స్