Blowing in the Wind: అప్పటి పాట..ఆ చిన్నారి గాయకుడు పాడితే..ఇప్పటికీ కొత్తగా..నెటిజన్లు ఫిదా!

|

Apr 30, 2021 | 4:43 PM

కొంతమంది చిన్నారులు చిన్నతనంలోనే అద్భుత ప్రతిభ చూపిస్తారు. వారికి జన్మతః ఆ ప్రతిభ అబ్బేస్తుంది. ఆ ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.

Blowing in the Wind: అప్పటి పాట..ఆ చిన్నారి గాయకుడు పాడితే..ఇప్పటికీ కొత్తగా..నెటిజన్లు ఫిదా!
Blowing In Wind
Follow us on

Blowing in the Wind: కొంతమంది చిన్నారులు చిన్నతనంలోనే అద్భుత ప్రతిభ చూపిస్తారు. వారికి జన్మతః ఆ ప్రతిభ అబ్బేస్తుంది. ఆ ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇక చిన్నారులు సంగీత పరిజ్ఞానం సంపాదిస్తే.. వారు పాడే గీతాల మాధుర్యం వీనుల విందుగా ఉంటుంది. వారి గానం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. తమ స్వరంలో సప్తస్వరలనూ సుస్వరంగా చిన్న పిల్లలు పలికిస్తుంటే ముచ్చటేస్తుంది. అలా తన అద్భుత గానంతో అందరినీ అలరిస్తున్న బాలుడు ఇషాన్ గౌరవ్. ఇక ఈ బాలుడు పాడిన ఒక పాట ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే, ఎదో ఆధునికమైన పాటను ఇషాన్ పాడలేదు. చాలా పాత పాట అది. పాత సంగీతకారుడు బాబ్ డైలాన్ 1963లో పాడిన పాట ఇది. ‘బ్లోవిన్ ఇన్ ది విండ్ ‘ అంటూ సాగే ఈ పాటను అద్భుతంగా పాడుతున్నాడు ఇషాన్. అతని తండ్రి బాసిస్ట్ గౌరవ్ చింతామణి ఈ పాటను ఇషాన్ పాడుతుంటే చిత్రీకరించి.. ఆ చిన్న క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

”మా అభిమనమైన పుస్తకాలలో విండ్ బై ఇలస్ట్రేటెడ్ బ్లోవిన్ ఒకటి. ఆ పుస్తకం జాతి, స్వేచ్ఛ, సమానత్వం గురించి చిన్న డ్యూడ్ మనలను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ‘బ్లోవిన్ ఇన్ ది విండ్ ‘ పాట సహాయపడింది. ఆ పుస్తకంలోని ప్రశ్నలకు సమాధానంగా ఈ పాట ఉంటుంది.” అని బాసిస్ట్ గౌరవ్ చెప్పారు. 1962 లో బాబ్ డైలాన్ రాసిన, బ్లోయిన్ ఇన్ ది విండ్ సింగిల్‌గా విడుదలై 1963 లో అతని ఆల్బమ్ ది ఫ్రీవీలిన్ బాబ్ డైలాన్‌లో ఈ పాటను చేర్చారు. అప్పట్లో ఈ పాటను నిరసన పాటగా వర్ణించారు. దీనిలో శాంతి, యుద్ధం అలాగే స్వేచ్ఛ గురించి అనేక అలంకారిక ప్రశ్నలు ఉంటాయి. క్లిష్టమైన ఈ పాటను చిన్నారి ఇషాన్ అవలీలగా పాడేశాడు.

ఈ వీడియో ట్వీట్ ఇక్కడ మీరూ చూడొచ్చు..

ఇషాన్ పాడిన ఈపాట క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో 17,000 మంది చూశారు. అనేక లైక్స్ అలాగే రీట్వీట్లతో వైరల్ అయ్యింది. ఈ పాటను చూసిన ప్రతి ఒక్కరూ ఇషాన్ ను అతని తండ్రిని అభినందిస్తున్నారు. చాల అద్భుతంగా పాడాడు అని ఒకరు.. ఇటువంటి పాటను మాకోసం ఇచ్చినందుకు ధన్యవాదములు అని ఒకరూ.. ఇలా ఈ పాటకు ప్రశంసల వర్షం కామెంట్ల రూపంలో వస్తున్నాయి. ఈ వీడియో పై వచ్చిన కామెంట్స్ కొన్ని మీరూ చూడొచ్చు ఇక్కడ..


Also Read: కరోనా అలర్ట్..! ఒక డోసు టీకా సరిపోతుంది..! రెండు డోసులు అవసరం లేదు..? తెలుసుకోండి..

సిద్దార్థ్ నేరస్థుడు, అతడ్ని మేమెందుకు బెదిరిస్తాం, బీజేపీ నేతల ఎదురు దాడి, పట్టించుకోవద్దని కార్యకర్తలకు హితవు