Bike stunt funny video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొంత మంది ఎన్నో రకాల ఫీట్లు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో వారు ప్రమాదంలో సైతం పడుతుంటారు. అలానే.. బైక్‌పై ఫీట్లు చేయాలనుకున్న ఇద్దరు యువకులు.. బొక్క బోర్లా పడ్డారు. నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండటంతో.. యువతలో స్టంట్స్ చేసే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. దీంతో సరికొత్త విన్యాసాలు చేస్తూ.. యూత్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఇలా చేసే క్రమంలో కొన్ని సార్లు చేసే పొరపాటు.. వారి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టెస్తుంది. అయితే.. మరికొన్ని సమయాల్లో ఏదో చేయబోతే.. మరేదో అవుతుంది.. ఇలాంటి వీడియోలు నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి బైక్ స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియా (social media) లో హల్ చల్ చేస్తోంది. ఇది చూసి మొదట షాక్ అవ్వొచ్చు.. ఆ తర్వాత నవ్వును అస్సులు ఆపుకోలేరు. పళ్లు బిగపట్టుకొని మరి నవ్వుకుంటారు.
వైరల్ అవుతున్న స్టంట్ వీడియోలో.. రోడ్డుపై వెళుతున్న బైక్‌పై ఒక వ్యక్తి వెనకకు తిరిగి కూర్చొని ఉండగా.. మరొక వ్యక్తి నిలబడి స్టైల్ కొడుతుంటాడు. ఈ స్టంట్ అతనికి ప్రాణాంతకంగా మారుతుందని.. లేదా కిందపడతామని వారిద్దరికీ తెలుసు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా.. ఆ యువకుడు నిలబడి మొబైల్‌లో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఇలా క్షణాల్లోనే బైక్ బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో అతను రోడ్డుపై కిందపడిపోతాడు. అదే సమయంలో ఎదురుగా కూర్చున్న యువకుడు కూడా.. బైక్‌తోపాటు పొదల్లోకి దూసుకెళ్లి కిందపడతాడు. అయితే.. ప్రమాద తీవ్రత చూస్తుంటే ఇద్దరికీ.. గాయాలైనట్లు అనిపిస్తుంది. ఈ ఫన్నీ స్టంట్ వీడియో ప్రస్తుతం.. నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..
వైరల్ వీడియో..
27 సెకన్ల బైక్ స్టంట్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో bhutni_ke_memes అనే పేజీలో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి.. లైకులు చేస్తున్నారు. దీంతోపాటు ఫన్నీ రియాక్షన్స్, కామెంట్స్ ఇస్తూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇద్దరికీ పిచ్చి ముదిరిందని.. బైక్‌పై ఎవరైనా సెల్ఫీలు దిగుతారా..? అంటూ పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..