సాధారణంగా ఏనుగులు చిన్న చీమకు కూడా అపకారం చేసేందుకు సాహసించవు. కొన్ని సార్ల అనుహ్యంగా ఇతర జంతువులపై, మనషుల పై దాడి చేస్తుంటాయి. ఏనుగుల ఆటలు.. లేదా ఇతర జంతువులపై, మనుషులపై దాడి చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని మాత్రం షాకింగ్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు ఓ ఏనుగు మాత్రం ఇద్దరు వ్యక్తులపై దాడి చేసేందుకు కోపంతో వచ్చింది. కానీ అనుహ్యంగా వెనకడుగు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఫిగెన్ అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఓ ఏనుగులో పార్క్ లో సరదాగా నడుస్తుంది. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులను గమనించి వారిపై దాడి చేసేందుకు ఎంతో కోపంతో దూసుకోచ్చింది. అయితే ఏనుగు కోపంగా వస్తున్నప్పటికీ ఆ ఇద్దరు వ్యకులు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. దీంతో వారిద్దరిని అలా చూసి దెబ్బకు వెనకడుగు వేసింది. భయపడకుండా ఉండటమే ఉత్తమమైన ఆత్మరక్షణ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Not panicking is the best self-defense method!
— Figen (@TheFigen) July 26, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.