పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆప్ తరఫున సీఎం పీఠాన్ని అధిష్ఠించనున్న భగవంత్ మాన్.. తాను స్టాండప్ కమెడియన్ గా ఉన్న రోజుల్లో లాఫ్టర్ ఛాలెంజ్ అనే రియాలిటీ షో లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ న్యాయనిర్ణేతగా ఉన్నారు. అయితే ఈ షో నుంచి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో భగవంత్ మాన్ రాజకీయాల గురించి జోక్ చేశారు. “రాజనీతి (రాజకీయం) అంటే ఏమిటని నేను ఒక రాజకీయ నాయకుడిని అడిగాను. ఎలా పరిపాలించాలో నిర్ణయించే చర్య అని ఆయన నాకు చెప్పారు. అప్పుడు గోర్మింట్ (ప్రభుత్వం) అంటే ఏమిటి అని అడిగాను. ప్రతి సమస్యను నిశితంగా చూసే వారు ఒక నిమిషం తర్వాత దానిని మర్చిపోతారు అని చెప్పారు” అని భగవాన్ మాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ జోక్ వినగానే శేఖర్ సుమన్‌తో పాటు జడ్జిగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ పగలబడి నవ్వారు. అయితే భగవంత్ మాన్ ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబోతున్న తరుణంలో ఈ వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది.
PUNJAB
It’s pretty clear that @BhagwantMann
will be the next CMAmong his competitors was @sherryontopp#Throwback to the Laughter Challenge – where Bhagwant was cracking a joke on politics and Siddhu was laughing as the judge. #PunjabElections
pic.twitter.com/gcoCnRa91R— Raj (@iamup) March 10, 2022
భగవంత్ మాన్..1973 అక్టోబరు 17న పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో జన్మించారు. చిన్నతనం నుంచే హాస్యచతురత కలిగిన మాన్.. కాలేజీ రోజుల్లో యూత్ కామెడీ ఫెస్టివల్స్‌లో పాల్గొనేవారు. ఆ తర్వాత అదే కెరీర్‌గా ఎంచుకున్నారు. రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు తదితర అంశాలపై తనదైనశైలిలో హాస్యాన్ని జోడిస్తూ అనతికాలంలో ప్రేక్షకాదరణ పొందారు. ఆయన చేసిన జుగ్ను కెహెందా హై, జుగ్ను మస్త్ మస్త్ వంటి బుల్లితెర కార్యక్రమాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. తను చేసిన టీవీ కార్యక్రమం జుగ్ను పేరును ముద్దుపేరుగా మార్చుకున్నారు. 2008లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌తో ప్రపంచ దేశాల్లో ఎంతో పేరుతెచ్చుకున్న మాన్.. పలు చిత్రాల్లోను నటించి మెప్పించారు.
Also Read
Today mirchi rate: దుమ్మురేపుతున్న మిర్చి ధర.. రికార్డులు బ్రేక్.. క్వింటా రేటెంతో తెలిస్తే షాకే..
Rashmika Mandanna: దళపతి విజయ్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పేసిన నేషనల్ క్రష్..
UP Elections BJP – MIM: ఎస్పీని ఘోరంగా దెబ్బతీసిన ఎంఐఎం.. బీజేపీకి రూట్ క్లియర్ చేసిందనే టాక్..!