ఆటో వెనుక భగవద్గీత శ్లోకాలు.. సనాతన ధర్మ ప్రచారంలో ఆటో డ్రైవర్‌ వినూత్న పంథా..

ఒక ఆటో డ్రైవర్ భగవద్గీత శ్లోకాలను, వాటి అర్థాలను తన ఆటో వెనుక భాగంలో రాసి సనాతన ధర్మాన్ని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. శ్రీ కృష్ణుడు అందించిన జీవన సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనే ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆటో వెనుక భగవద్గీత శ్లోకాలు.. సనాతన ధర్మ ప్రచారంలో ఆటో డ్రైవర్‌ వినూత్న పంథా..
Bhagavad Gita Viral Auto

Updated on: Oct 01, 2025 | 7:47 PM

భగవద్గీత.. హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి. ఇందులో జీవితానికి అత్యంత విలువైన సందేశం ఉంటుంది. ఈ భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు మొత్తం సమాజానికి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. అయితే చాలా మందికి భగవద్గీతలోని శ్లోకాల అర్థం తెలియదు. అలాంటి వారి కోసం, అలాగే సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఓ ఆటో డ్రైవర్ వినూత్న పంథాను ఎంచుకున్నారు. తన ఆటో వెనుక భాగంలో భగవద్గీత శ్లోకాన్ని దాని అర్థంతో పాటు వ్రాసి సనాతన ధర్మ ప్రచారకుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని ఆటో వెనుక ఉన్న శ్లోకాలు, వాటి అర్థాలు చూపిస్తూ ఓ మహిళ తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

శీతల్ చోప్రా షేర్ చేసిన వీడియోలో సనాతన ధర్మాన్ని, దాని అర్థాన్ని ప్రచారం చేసే ఆటో వెనుక భాగంలో భగవద్గీత శ్లోకం కనిపిస్తుంది. “దీన్ని మరింత మంది అనుసరించాలని నేను కోరుకుంటున్నాను, అలాంటి వారే నిజమైన ధర్మ యోధులు” అని అతను క్యాప్షన్‌ పెట్టాడు. వీడియోలో ఒక మహిళ ఆటో వెనుక భాగంలో రాసిఉన్న భగవద్గీత శ్లోకాలను చూపిస్తున్నారు. సనాతన ధర్మ ప్రచారక్‌గా పనిచేస్తున్న ఆటో డ్రైవర్ పనిని ఆ మహిళ అభినందిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. అక్టోబర్ 1న షేర్ అయిన ఈ వీడియో పన్నెండు వేలకు పైగా వీక్షణలను పొందింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి