Viral Post: వార్నీ.. ఇదేం పార్క్‌రా సామీ.. ఇక్కడి నియమాలు చూస్తే బిత్తరపోవాల్సిందే..

|

Mar 22, 2025 | 7:22 PM

సాధారణంగా ప్రజలు ఉదయం, సాయంత్రం పార్క్‌లకి వెళ్తుంటారు. పార్క్‌కి వచ్చేవాళ్లు ఎక్కువగా వాకింగ్‌, జాకింగ్‌ వంటి కార్యకలాపాలు చేస్తుంటారు. అలాగే, కొన్ని రకాల గేమ్స్‌ కూడా పార్క్‌ల్లో అందుబాటులో ఉంటాయి. కానీ, ఇలా పార్క్‌ వెళ్లిన ప్రజలు వాకింగ్‌ చేయరాదు.. జాకింగ్‌ నిషేధం, గేమ్స్‌ ఆడరాదు అంటే ఎలా ఉంటుంది.. చిర్రెత్తుకొస్తుంది కదా..? సరిగ్గా అలాంటి నిబంధనలే పెట్టారు ఓ పార్క్‌లో ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అది ఎక్కడ..? ఎంటా నియమాలు ఇక్కడ తెలుసుకుందాం..

Viral Post: వార్నీ.. ఇదేం పార్క్‌రా సామీ.. ఇక్కడి నియమాలు చూస్తే బిత్తరపోవాల్సిందే..
Unusual Park Rules
Follow us on

బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి గతంలో చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అది పబ్లిక్ పార్కులో కొన్ని వింత నియమాలకు సంబంధించిన అంశం.. వైరల్ పోస్ట్ ప్రకారం, పార్కును సందర్శించే ప్రజలు జాగింగ్ చేయవద్దని, ‘సవ్యదిశలో’ మాత్రమే నడవాలని సూచించారు.. దీనిపై ఇంటర్నెట్ ప్రజలు తీవ్రంగా స్పందించారు. పార్కులో జాగింగ్ చేయకూడదనే నిబంధన చూసిన ప్రజలు షాక్ అయ్యారు.

ఇటీవల, బెంగళూరులోని ప్రజలను గందరగోళానికి గురిచేసిన పార్క్ నియమాల గురించి ఆన్‌లైన్‌లో ఒక పోస్ట్ షేర్ చేయబడింది. పోస్ట్‌లో షేర్ చేయబడిన ఫోటో ప్రకారం,ఈ పార్కుకు వచ్చే వ్యక్తులు జాగింగ్ చేయవద్దని, సవ్యదిశలో మాత్రమే నడవాలని, గేమింగ్ వంటి కార్యకలాపాలలో పాల్గొనకూడదని చెబుతున్నారు. పార్కులోని నిబంధనలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలు తమ నిరాశను వ్యక్తం చేస్తూ, ఒక వ్యక్తి ఈ నియమాలను, అలాంటప్పుడు ఈ పార్క్‌ అవసరం ఏంటని ప్రశ్నించాడు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు.. అలాగే, ఇలాంటి వింత బోర్డు ఏర్పాటు చేసిన ప్రదేశం బెంగళూరునా లేదా మరేదైనా ప్రదేశమా అనే దానిపై కూడా ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. చాలా మందికి ఈ నియమాలు వింతగా అనిపించాయి. మరికొందరు దీనిని సమర్ధిస్తూ ఈ నియమాలు ప్రజల సౌలభ్యం కోసమే అని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..