
ప్రస్తుత కాలంలో మన దైనందిన జీవితంలో టెక్నాలజీ ఒక భాగమైపోయింది. టెక్నాలజీ లేకుండా మనం శూన్యం అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది తమ తెలివితేటలతో కొత్తగా ఏదైనా చేస్తారు. ఇప్పుడు బెంగళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ ఇలాంటి పని చేసి వార్తల్లో నిలిచాడు . బెంగళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ గేమింగ్ చైర్‌ను ఆటో ఫిట్ చేశాడు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ పోస్ట్ @NarasimhaKan అనే ఎక్స్ ఖాతా షేర్ అయింది. “ఈ రోజు నాకు ఒక ఎర్గోనామిక్ ఆటో కనిపించింది” అని క్యాప్షన్ ఉంది. ఈ పోస్ట్‌లో ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో గేమింగ్ చైర్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు చూడవచ్చు. సెప్టెంబర్ 4న షేర్ చేయబడిన ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు రెండు లక్షల తొంభై వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
got blessed with an ergonomic auto today pic.twitter.com/f14ZTEsEym
— Narasimha Kanduri (@NarasimhaKan) September 4, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి