అమ్మాయిల్లో అందమే కాదు.. తెగువ కూడా ఎక్కువే. తేడా వచ్చిందంటే తాట తీస్తారు. సాధారణంగా పాములంటే అందరికీ భయమే. ఇక కొందరు యువతులైతే పాములను దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటారు. అయితే ఇక్కడ ఓ యువతి.. ఒట్టి చేతులతో పొడవాటి విషసర్పాన్ని ఇట్టే పట్టేసింది. అందంతో పాటు ధైర్యం కూడా తనలో ఉందని నిరూపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. సైబా అనే యువతి ఓ ఇంట్లో దాగి ఉన్న ప్రమాదకరమైన ర్యాట్ స్నేక్‌ను ఒట్టి చేతులతో పట్టుకుని బయటకు లాగింది. అనంతరం ఆ పాముతో రకరకాల ఫోటోలకు పోజులిచ్చింది. ఆ పామును బంధించేందుకు అక్కడున్న గ్రామస్తులు భయంతో ముందుకు రాకపోగా.. ఈమె మాత్రం ఎక్కడా కూడా బెదరకుండా ఆ పామును ఓ గోనె సంచిలో వేసుకుని.. దూరంగా ఊరు బయట అడవిలో విడిచిపెట్టింది. ఓ యువతి ఇంత ధైర్యంగా పామును పట్టుకోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇప్పటిదాకా దీనికి 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చిపడ్డాయి. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.