Viral Video: ఎలుగుబంటిని వెనుకనుంచి వేటాడేందుకు పులి ప్రయత్నం.. క్షణాల్లో సీన్ రివర్స్

అడవిలో జంతువుల పోరాటం సర్వసాధారణం. అక్కడ మరో జీవిని ఆహారంగా తీసుకోకుండా బ్రతకలేని జీవులు చాలా ఉంటాయి. అయితే రెండు సమవుజ్జీలు...

Viral Video: ఎలుగుబంటిని వెనుకనుంచి వేటాడేందుకు పులి ప్రయత్నం.. క్షణాల్లో సీన్ రివర్స్
Tiger-attacked-bear
Follow us

|

Updated on: Aug 20, 2021 | 8:00 PM

అడవిలో జంతువుల మధ్య పోరాటం సర్వసాధారణం. అక్కడ మరో జీవిని ఆహారంగా తీసుకోకుండా బ్రతకలేని జీవులు చాలా ఉంటాయి. అయితే రెండు సమవుజ్జీలు పోరాడినప్పుడే అసలు సిసలైన కిక్ ఉంటుంది. కాగా పులి, ఎలుగుబంటి రెండూ బలమైన జీవులే. ఈ రెండు నువ్వా-నేనా అంటూ సమరానికి దిగిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. తాజాగా అలాంటి ఫైట్ ఒకటి కెమెరాకు చిక్కింది. వాస్తవానికి ఎలుగుబంటి తన పనేదో తాను చేసుకుంటుంది. పులి వెళ్లి దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అప్పుడు జరిగిన సీన్ మీరు అస్సలు ఊహించలేరు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఆగస్టు 19 న షేర్ చేశారు. ఎలుగుబంటి ప్రాంక్‌ను చాలా సీరియస్‌గా తీసుకుందని కామెంట్ పెట్టారు. వార్తలు రాసే సమయానిఈ క్లిప్  8 వేలకు పైగా వ్యూస్.. 1100 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నెట్టింట షేర్లతో హోరెత్తిస్తున్నారు.

వీడియో దిగువన చూడండి-

ఎలుగుబంటి ఆహారం కోసం వెతుకుతుండటం ఈ వీడియోలో మీరు చూడవచ్చు. కానీ ఈ సమయంలో, ఒక పులి కళ్ళు దానిపై పడ్డాయి. నెమ్మదిగా ఆ పులి.. ఎలుగును వేటాడేందుకు వెళ్లింది. వెనుక నుంచి దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో వెంటనే అలెర్టైన ఎలుగుబంటి తిరిగి అటాక్ చేసింది. అప్పుడు పులి భయంతో అక్కడినుంచి పరారయ్యింది. పారిపోతున్నా కూడా ఎలుగు వదిలిపెట్టలేదు. చాలాదూరం వరకు వెంటాడింది.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్లు ఆకర్షిస్తున్నాయి. ‘పులి తానెంతో బలవంతురాలిగా కటింగ్ కొడుతుంది, ఎలుగుబంటి దాని అహంకారాన్ని క్షణంలో తొలగించింది’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. అదే సమయంలో, మరొక నెటిజన్  ‘ఇలాంటి దృశ్యం అరుదు’ అని పేర్కొన్నాడు.

Also Read:విచిత్రం.. మగ జన్యువు లేకుండానే పుట్టిన బుల్లి సొరచేప.. నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్న వైనం

బండ్లేశ్వరా..! 48 ఏళ్ల వయస్సులో హీరోగా టర్న్.. ఆ హిట్ సినిమాకు రీమేక్.. సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్‌