ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో సర్కిల్ ఆఫీసర్ (CO) సునీల్ కుమార్, బుధవారం హెయిర్‌కట్ కోసం స్థానిక క్షురకుడు వినోద్ కుమార్‌ను తన ఇంటికి పిలిపించాడు. అయితే, ఆ సమయంలో షాపులో కస్టమర్లు ఎక్కువగా ఉండటంతో కొంచెం ఆలస్యంగా ఆ పోలీస్ అధికారి ఇంటికి వెళ్లాడు బార్బర్ వినోద్ కుమార్. దీంతో సర్కిల్ ఆఫీసర్ (సీవో) సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
హెయిర్‌కట్ చేసి వెళ్లిన ఆ బార్బర్ కోసం పోలీసులను పంపాడు. దీంతో పోలీసులు అతడి సెలూన్ షాప్‌కు వెళ్లి మరీ.. అతన్ని అరెస్ట్ చేశారు. ఆ షాపును బలవంతంగా మూయించారు. బార్బర్ వినోద్ కుమార్‌ను తీసుకెళ్లి మధ్యాహ్నం వరకు బిసౌలీ పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు.
మరోవైపు వినోద్ సోదరుడు శివకుమార్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. దీంతో జిల్లా ఎస్పీ అలోక్ ప్రియదర్శిని దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేసి ఆ పోలీస్ అధికారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..