death festival in Bali island: కుటుంబంలో ఎవరైనా చనిపోతే నెలలు, సంవత్సరాల తరబడి విషాదంలో మునిగితేలుతారు. ఈ షాక్ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. తిండి, నిద్రమానేసి విషాత వదనాలతో కన్పిస్తారు. ప్రపంచంలో ఉన్న కోట్ల జనాభాలో దాదాపు ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారు. ఐతే రోటీన్‌కు విరుద్ధంగా ఈ ప్రాంతంలోని ప్రజలు తమ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. కొత్త బట్టలు ధరించి, అట్టహాసంగా పండుగలా జరుపుకుంటారు. ఎక్కడంటే.. ఇండోనేషియాలోని బాలి ద్వీపం నివాసులు ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తుంటారు. ఈ ద్వీపంలో ఎవరైనా మృతి చెందితే పండుగకు ఏ మాత్రం తక్కువ కాకుండా వేడుకగా జరుపుకుంటారు. డప్పులు, పాటలు, డ్యాన్సులతో పెద్ద ఊరేగింపుతో మృతదేహాన్ని ఖననం చేస్తారు. అనంతరం ఈ వేడుకను చాలా కాలంపాటు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారట.
నిజానికి.. బాలీ ద్వీపంలో నివసించే ప్రజలకు ఓ నమ్మకం ఉంది. అదేంటంటే.. మరణం తర్వాత ఆత్మ అన్ని బంధాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా పొందుతుందని ఈ ద్వీప నివాసితులు నమ్ముతారు. మృత్యువు ద్వారా ఆత్మ విముక్తి పొందిన సందర్భాన్ని ఆనందంతో వేడుకగా జరుపుకుంటారు. ఒక కుటుంబంలో ఎవరైన చనిపోతే కొత్త దుస్తులు, ఖరీదైన ఆభరణాలు ధరించుకుని అందంగా ముస్తాబవుతారు. అనంతరం ఆటపాటలతో సందడిగా మరణించినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. మృతదేహానికి ముందు అరవై అడుగుల ఎత్తైన స్తంభానికి పట్టుకుని ఊరంతా ఊరేగిస్తారు. అలాగే చనిపోయిన వ్యక్తి ఇంటి ముందు కుడి భాగంలో నెయ్యితో దీపం వెలిగించి ఖననం చేసేందుకు శుభ ఘడియల కోసం ఎదురు చేస్తుంటారు. శుభ ఘడియల కోసం రోజుల పాటు వేచి ఉండి అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. దాదాపు ద్వీపంలో అందరూ ఈ ఆచారాన్ని పాటిస్తారు. అందువల్లనే ఈ ద్వీపంలో చాలా మంది నివాసులు అంత్యక్రియలను గ్రాండ్‌గా నిర్వహించేదుకు సరిపడా డబ్బులేక తమ ఇళ్లను సైతం అమ్ముకుని అప్పుల పాలయ్యారట. విచిత్రంగా ఉన్నా ఇప్పటికీ బాలి ద్వీపంలో ఈ ఆచారం కొనసాగుతోంది.