
తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్లో అరుదైన బ్లాక్ పాంథర్ (నల్ల చిరుత) కనిపించింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉండే ఈ జంతువుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.. భగీరా తన ఫ్రెండ్స్‌తో కలిసి నీలగిరి రోడ్లపై నైట్ వాక్ చేస్తోంది. ఇది చాలా అరుదైనది.. అంటూ క్యాప్షన్ కూడా రాశారు. అర్ధరాత్రి వేళ 2 చిరుతలతో కలిసి బ్లాక్ పాంథర్ వెళుతున్న దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తమిళనాడులోని నీలగిరిలోని పచ్చని ప్రాంతంలో రెండు సాధారణ రంగుల చిరుతపులితో పాటు ఒక నల్ల చిరుతపులి (మెలనిస్టిక్ చిరుతపులి) సంచరిస్తూ కనిపించింది. వన్యప్రాణుల ఔత్సాహికులకు.. అటవీ అధికారులకు ఇది అరుదైన దృశ్యమని పేర్కొంటున్నారు.
Bagheera (black panther) and other friends for night walk on the roads of Nilgiris. What a rare thing. pic.twitter.com/NtaNSlWUAp
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 18, 2025
ఈ క్లిప్‌లో, మెలనిస్టిక్ చిరుతపులి పక్కన రెండు మచ్చల చిరుతలు తిరుగుతున్నట్లు కనిపిస్తాయి.. ఈ చిరుతపులి చాలా ముదురు నల్లరంగులో ఉంటుంది. మెలనిస్టిక్ – నాన్-మెలనిస్టిక్ జాతులు ఇంత ఐక్యంగా సంచరించడం చాలా అరుదు..
ఈ ఫుటేజీని చూస్తే జూలై 16 అర్ధరాత్రి రికార్డు అయినట్లు తెలుస్తోంది.. ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు షేర్ చేసి.. నీలగిరిలో నల్లపులి.. భగీరా అద్భుతం అంటూ కామెంట్లు కామెంట్లు చేస్తున్నారు.
Rare & Remarkable Sighting🐆
Black panther along with 2 other leopards spotted in Nilgiris. pic.twitter.com/2GFOb6b4dg
— Kishore Chandran (@tweetKishorec) July 17, 2025
కాస్వాన్ నల్ల చిరుతపులులు సాధారణ చిరుతపులి (పాంథెరా పార్డస్) మెలనిస్టిక్ వైవిధ్యం అని.. ఒక ప్రత్యేక జాతి కాదని స్పష్టం చేశారు. మెలనిజం అనేది వంశపారంపర్య రుగ్మత, ఇది అధిక ముదురు వర్ణద్రవ్యాన్ని కలిగిస్తుంది.. దీని వలన ఈ జంతువులకు నల్లగా కనిపిస్తుంది. కొన్ని కాంతి పరిస్థితులలో వాటి రంగు మరింత కాంతివంతంగా ప్రకాశిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..