Viral Video: క్రాలింగ్ పోటీ మధ్యలో కునుకు తీస్తున్న బుడ్డోడు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

చిన్న పిల్లల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులను పాడు చేస్తూ ఉంటారు. ఇండియాలో అయితే తక్కువ కానీ.. థాయ్ లాండ్, జపాన్, చైనా లాంటి దేశాల్లో అయితే సంవత్సరం ఉన్న లోపు పిల్లలతో అనేక రకాల ఆటలు ఆడిస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో..

Viral Video: క్రాలింగ్ పోటీ మధ్యలో కునుకు తీస్తున్న బుడ్డోడు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Viral Video (1)

Updated on: Aug 18, 2024 | 6:32 PM

చిన్న పిల్లల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులను పాడు చేస్తూ ఉంటారు. ఇండియాలో అయితే తక్కువ కానీ.. థాయ్ లాండ్, జపాన్, చైనా లాంటి దేశాల్లో అయితే సంవత్సరం ఉన్న లోపు పిల్లలతో అనేక రకాల ఆటలు ఆడిస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. తాజాగా ఇప్పుడు ఓ పోటీల్లో పిల్లలకు పాల్గొన్న వీడియో ఒకటి నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూస్తే నిజంగానే నవ్వు తెప్పిస్తుంది.

థాయ్‌లాండ్‌కు చెందిన చిన్న పిల్లలు పాల్గొన్న క్రాల్ పోటీకి సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇందులో చిన్న పిల్లలు పాల్గొన్నారు. చిన్న పిల్లలు గేమ్స్‌లో పాల్గొంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరికొద్ది సమయంలో ముగింపుకు చేరుకుంటుంది అనగా.. ఓ బేబీ మధ్యలో పడుకున్నాడు. దీంతో క్రౌన్ పోటీని ఆపారు. కాసేపు విరామం ప్రకటించారు. దీంతో అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఇంతకు ముందు ఇలాంటి వీడియోలు చాలానే చూశాము. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.