
ఈ వైరల్ వీడియోలో కొండముచ్చు పిల్ల ఒకటి హైటెన్షన్ వైర్ పై చిక్కుకుంది. అక్కడ్నుంచి పక్కనే ఉన్న పైకప్పుపైకి దూకడానికి ప్రయత్నిస్తుంది. కానీ, దానికి అలా చేయడానికి ధైర్యం సరిపొదు. తల్లి కొండముచ్చు ఆ పిల్లకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ఆ పిల్ల కొండముచ్చు అక్కడ్నుంచి తప్పించుకోలేకపోతుంది. అప్పుడు ఇక దాని తల్లి తన బిడ్డను కాపాడేందుకు కదిలింది. ఆపద నుండి తన బిడ్డను రక్షించేందుకు నిశ్చయించుకుంది. ఎట్టకేలకు బిడ్డ ప్రాణాలను కాపాడింది తల్లి.
హైటెన్షన్ వైర్లపై చిక్కుకున్న ఆ బిడ్డ కొద్దిసేపు ఇబ్బంది పడింది. చివరకు దాని తల్లి వెంటనే పైకప్పు నుండి దూకి, తీగ వద్దకు చేరుకుని క్షణాల్లో తన బిడ్డను రక్షించింది. ఆ తల్లి ధైర్యం తన బిడ్డ ప్రాణాలను కాపాడింది. కాగా, వీడియోకు ప్రజల స్పందన వెల్లువెత్తింది.
The rescue is just incredible. pic.twitter.com/aKEygFeytK
— The Best (@Thebestfigen) January 18, 2026
ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ Xలో @Thebestfigen అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. దీనిని లక్షలాది మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోకు విభిన్న కామెంట్లు కూడా వచ్చాయి. తల్లి ఆప్యాయతకు చాలామంది చలించిపోగా, మరికొందరు కోతి తల్లి ధైర్యాన్ని ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..