Watch: ప్రైమరీ స్కూల్‌లోకి అనుకోని అతిథి ఎంట్రీ..! అడ్మిషన్‌ కావాలేమో అంటున్న నెటిజన్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఇది ఒక పాఠశాలకు సంబంధించినది. ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. వయనాడ్‌లోని అటవీప్రాంతపు కుగ్రామంలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సోమవారం ఉదయం అనుకోని అథితి వచ్చింది. ఆ అథితిని చూసిన విద్యార్థులు, పాఠశాల సిబ్బంది షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Watch: ప్రైమరీ స్కూల్‌లోకి అనుకోని అతిథి ఎంట్రీ..! అడ్మిషన్‌ కావాలేమో అంటున్న నెటిజన్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Elephant Calf

Updated on: Aug 21, 2025 | 9:22 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతాయి. కానీ కొన్ని వీడియోలు చాలా ప్రత్యేకమైనవి.. కాబట్టి ప్రజలు వాటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది కేరళలోని ఒక పాఠశాలకు సంబంధించినది. ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. వయనాడ్‌లోని అటవీప్రాంతపు కుగ్రామంలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సోమవారం ఉదయం అనుకోని అథితి వచ్చింది. ఆ అథితిని చూసిన విద్యార్థులు, పాఠశాల సిబ్బంది షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కేరళ-కర్ణాటక సరిహద్దులోని పుల్పల్లి నుండి దాదాపు 14 కి.మీ దూరంలో ఉన్న చెకాడి గ్రామం మూడు వైపులా అడవితో చుట్టుముట్టబడి ఉంది. వరి పొలాలకు, ప్రధానంగా గిరిజన సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతం ఇది. ప్రీ-ప్రైమరీ తరగతులను కూడా కలిగి ఉన్న ప్రభుత్వ LP స్కూల్ చెకాడిలో దాదాపు 115 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక ఎకరంలో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్ ఏనుగుల ఉనికికి కొత్తేమీ కాదు, సూర్యాస్తమయం తర్వాత తరచుగా మందలుగా ప్రయాణిస్తాయి. ఈ క్రమంలోనే అనుకోకుండా సోమవారం ఉదయం ఒక ఒక ఏనుగు పిల్ల ఒంటరిగా స్కూల్‌ ఆవరణలోకి ప్రవేశించింది. అసాధారణంగా కనిపించిన ఏనుగు పిల్లను చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు షాక్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వైరల్‌ వీడియోలో ఆ పిల్ల ఏనుగు పాఠశాల చుట్టూ ఆసక్తిగా తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆ అడవి జంతువు బుల్లి ఏనుగు అందాన్ని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఏనుగు పిల్ల స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి లేదా బదిలీ సర్టిఫికేట్ కోసం వచ్చి ఉండవచ్చని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే, స్కూల్‌ ఆవరణలోకి ఏనుగు రావడం ఇదే మొదటిసారి అని ఉపాధ్యాయులు తెలిపారు.

ఈ సంఘటన మొత్తం స్కూల్లోని సీసీ కెమెరాలో రికార్డైంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను @hashtag_wayanad ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..