Baby Dinosaurs Video: భూమిపై మళ్లీ పుట్టిన డైనోసర్లు..నమ్మకం కుదరట్లేదా! షాకింగ్‌ వీడియో..

|

May 13, 2022 | 4:02 PM

డైనోసర్లు గురించి పుస్తకాల్లో, బాలీవుడ్ సినమాల్లో చాలా సార్లు తెలుసుకుని ఉంటారు. ఐతే ఉన్నట్టుండి హఠాత్తుగా డైనోసర్ మన కళ్లముందుకొస్తే.. ఇది ఊహ కాదు.. కల అంతకన్నాకాదు. నిజంగానే భూమిపై డైనోసర్ పిల్లలు (Baby Dinosaurs) సంచరిస్తున్న వీడియో (viral video) ఒకటి సోషల్ మీడియాలో..

Baby Dinosaurs Video: భూమిపై మళ్లీ పుట్టిన డైనోసర్లు..నమ్మకం కుదరట్లేదా! షాకింగ్‌ వీడియో..
Dinosaurs
Follow us on

Netizens shock after seeing viral video showing Baby Dinosaurs on a beach: డైనోసర్లు గురించి పుస్తకాల్లో, బాలీవుడ్ సినమాల్లో చాలా సార్లు తెలుసుకుని ఉంటారు. డైనోసర్లు భూమిపై నివసించిన అత్యంత భారీ జంతువని, ఇవి మిలియన్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయని, వీటి జాతి ఎప్పుడు అంతరించిందనే విషయం ఖచ్చితంగా నిర్ధారించలేమని శాస్త్రవేత్తలు సైతం చెప్పారు. నేలపై దొరకిన శిలాజాలు, రాళ్లను పరీక్షించి 6.6 కోట్ల ఏళ్ల క్రితం అతి పెద్ద ఉల్క భూమిని ఢీకొనిందని చెబుతున్నారు. ఈ ఉల్క భూమిని ఢీకొట్టడం వల్ల దాదాపు 100 కిలోమీటర్ల వెడల్పు, 30 కిలోమీటర్ల లోతులో బిలం ఏర్పడిందని, అందుకే ఈ భారీ జంతువు శాశ్వతంగా కనుమరుగైపోయిందనేది శాస్త్రవేత్తలు చెప్పేమాట. ఐతే ఉన్నట్టుండి హఠాత్తుగా డైనోసర్ మన కళ్లముందుకొస్తే.. ఇది ఊహ కాదు.. కల అంతకన్నాకాదు. నిజంగానే భూమిపై డైనోసర్ పిల్లలు (Baby Dinosaurs) సంచరిస్తున్న వీడియో (viral video) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో డైనోసర్లు మాదిరిగానే ఉన్న జంతువులను చూసి నెటిజన్లు అమితాశ్యర్యాలకు గురౌతున్నారు. ఈ వీడియోవైపు మీరూ ఓలుక్కేయండి..

ఈ వీడియోలో డైనోసర్లను పోలిన జంతువుల గుంపు సముద్రం ఒడ్డున వరుసగా పరుగెత్తడం కనిపిస్తుంది. ఐతే ఇవి డైనోసర్ల కంటే కూడా చాలా చిన్న సైజులో ఉంటడం గమనార్హం. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్లలో వ్యూస్‌, కామెంట్లు, లైకులతో నెట్టింట వైరల్ అయ్యింది. వీటిని చూస్తే నిజంగానే భూమిపై మళ్లీ డైనోసర్ల జాతి పురుడుపోసుకుంటుందా అనేంత ఆశ్యర్యం కలుగుతోంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లంతా సోషల్‌ మీడియాలో చర్చకు దిగారు.

ఐతే నిజానికి డైనోసార్లలో చాలా రకాలు ఉంటాయని, వీటిలో పొడవాటి మెడ గల డైనోసార్లు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాటిని మామెంచిసారస్ డైనోసార్ అని అంటారట. ఐతే అచ్చం డైనోసార్లలా కనిపించే ఈ వింత జీవులు భూమిపైకి ఎలా వచ్చాయో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక అంతా నోరెళ్ల బెడుతున్నారు. అంతేకాకుండా అసలిది ఏ విధమైన జంతువు అనేది ఇంకా తెలియరాలేదు.

Also Read:

ACSR GMC Nellore Jobs 2022: టెన్త్ అర్హతతో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్య కాలేజీలో ఉద్యోగాలు..