Viral: అప్పుడే పుట్టిన బిడ్డను చూడబోయిన తల్లి.. తీరా కనిపించిన దృశ్యానికి మైండ్ బ్లాంక్!

|

Sep 01, 2022 | 6:03 PM

ఇలాంటి సంఘటనలు మనం వినడం, చూడటం చాలా అరుదు. ఓ మహిళ ప్రసవించిన అనంతరం తనకు పుట్టిన బిడ్డను చూడగా..

Viral: అప్పుడే పుట్టిన బిడ్డను చూడబోయిన తల్లి.. తీరా కనిపించిన దృశ్యానికి మైండ్ బ్లాంక్!
Representative Image
Follow us on

ఇలాంటి సంఘటనలు మనం వినడం, చూడటం చాలా అరుదు. ఓ మహిళ ప్రసవించిన అనంతరం తనకు పుట్టిన బిడ్డను చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యానికి ఆమె ఒక్కసారిగా కంగుతిన్నది. అసలేం జరిగింది.? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..!

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శివ్‌పూరి జిల్లాలోని మనపురా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జన్యులోపంతో కూడిన ఓ శిశువు జన్మించింది. కాళ్లు బదులుగా కొమ్ము లాంటి శరీర నిర్మాణం ఉండటంతో తల్లిదండ్రులతో సహా, ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. సదరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆగష్టు 26వ తేదీన ఈ శిశువు జన్మించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆందోళన చెందిన మనపురా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది.. మెరుగైన వైద్యం నిమిత్తం సదరు శిశువు, తల్లిని శివ్‌పూరి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కాగా, నవజాత శిశువు సరిగ్గా అభివృద్ధి చెందలేదని.. కేవలం 1.04 కిలోల బరువు మాత్రమే ఉందని జిల్లా ఆస్పత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. ఇది నవజాత శిశువుల సాధారణ బరువు కంటే చాలా తక్కువని.. వైద్యపరంగా ఈ ఘటన అరుదుగా ఉన్నప్పటికీ, శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆ శిశువు ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్(SNCU)లో స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో ఉందని చెప్పారు. సాధారణంగా గర్భంలోని శిశువు అభివృద్ధి చెందకపోతే.. వైకల్యం లేదా బరువు తక్కువగా ఉండటం జరుగుతుందని అక్కడి డాక్టర్లు పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..