Autorickshaw Race : అద్బుతమైన ఆటోరిక్షా రేస్.. ఫార్ములా1 కంటే బాగుందంటూ నెటిజన్ల ప్రశంసలు.. వీడియో వైరల్‌

|

Nov 06, 2023 | 12:27 PM

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో షేర్ చేయబడింది. రేసింగ్ మార్క్ వద్ద మూడు ఆటోలు వరుసలో నిల్చున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.. ఒక వ్యక్తి జెండాతో నిలబడి ఉన్నాడు. అతను ఫ్లాగ్ ఆఫ్ చేసిన వెంటనే, మూడు ఆటోరిక్షాలు పూర్తి వేగంతో దూసుకు వెళ్తున్నాయి.. చదును చేసిన ట్రాక్‌లపై ఆటోరిక్షాలు నడుస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఇది జరిగింది ఎక్కడో తెలియదు గానీ, ఆటో రేస్ జరిగింది మాత్రం ఢిల్లీలో అని వీడియోను రెడ్డిట్ లో పోస్ట్ చేశారు. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

Autorickshaw Race : అద్బుతమైన ఆటోరిక్షా రేస్.. ఫార్ములా1 కంటే బాగుందంటూ నెటిజన్ల ప్రశంసలు.. వీడియో వైరల్‌
Autorickshaw Race
Follow us on

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో ఆటోరిక్షా రేస్‌కి సంబంధించినది. వీడియోలో ఆటోరిక్షా వేగం చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి చాలా ఫన్నీ కామెంట్స్ కూడా వచ్చాయి. వీడియోలో ఆటో జీపీ అని రాసి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో షేర్‌ చేయబడింది. రేసింగ్ మార్క్ వద్ద మూడు ఆటోలు వరుసలో నిల్చున్నట్లు ముందుగా మనం వీడియోలో చూస్తాం.. అయితే, ఢిల్లీలో జరిగిన ఈ రేసులో ఎవరు గెలిచారనేది మాత్రం తెలియరాలేదు..కానీ, ఆటోల రేసింగ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఢిల్లీలో కొందరు ఆటో వాలాలు మూడు ఆటోలతో రేసింగ్ నిర్వహించారు. చూసే వారికి ప్రొఫేషనల్ రేసింగ్‌కు ఏమాత్రం తగ్గకుండా..ఫార్ములా 1 రేసింగ్..గుర్తుకు వచ్చేలా ఓ రేంజ్‌లో ఈ ఆటో రేసింగ్ పోటీ నిర్వహించారంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

బైక్‌ రేసింగ్‌ తెలుసు, కార్‌ రేసింగ్‌ తెలుసు కానీ, మీరేప్పుడైన ఆటో రేసింగ్‌ చూశారా..? అవును మీరు చదివింది నిజమే.. అద్భుతమైన ఆటో రేసింగ్‌ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన చాలా మంది దీనిపై స్పందించారు. సమాచారం ప్రకారం, ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో షేర్ చేయబడింది. రేసింగ్ మార్క్ వద్ద మూడు ఆటోలు వరుసలో నిల్చున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.. ఒక వ్యక్తి జెండాతో నిలబడి ఉన్నాడు. అతను ఫ్లాగ్ ఆఫ్ చేసిన వెంటనే, మూడు ఆటోరిక్షాలు పూర్తి వేగంతో దూసుకు వెళ్తున్నాయి.. చదును చేసిన ట్రాక్‌లపై ఆటోరిక్షాలు నడుస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఇది జరిగింది ఎక్కడో తెలియదు గానీ, ఆటో రేస్ జరిగింది మాత్రం ఢిల్లీలో అని వీడియోను రెడ్డిట్ లో పోస్ట్ చేశారు. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

24 సెకన్ల నిడివి గల ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రేసు తుది ఫలితం,ఎండింగ్‌ పాయింట్ చూపించలేదు. మరోవైపు, వినియోగదారులు వీడియోపై ఒకదాని తర్వాత మరొకటి కామెంట్‌ను పోస్ట్ చేశారు. ఈ పోటీ నిజమైనదిగా ఉండాలని చాలా మంది ప్రజలు కామెంట్లలో రాశారు. మరోవైపు, 2023 సీజన్ కంటే ఫార్ములా 1 న మించిపోయేలా చాలా ఆసక్తికరమైన రేసు అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. నేను ఈ రేసును చూడటానికి ఇష్టపడతాను అని మరొకరు రాశారు. ఇది ఎక్కడ జరుగుతోంది? అంటూ మరికొందరు అడుగుతున్నారు. దీంతో పాటు అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..