Thiruvonam Bumper lottery: ఓనం పండుగ సదర్భంగా లాటరీ పెట్టారు.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి.. ఏదో ఆశగా ఓ లాటరీ టికెట్ తీసుకున్నాడు.. కానీ అదృష్టం తన తలుపుతడుతుందని అస్సలు ఊహించలేదు.. కట్‌చేస్తే.. రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. కేరళకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు లాటరీలో రూ.12 కోట్ల బహుమతి లభించింది. ఓనం పర్వదినం సందర్భంగా నిర్వాహాకులు.. తిరుఓనం బంపర్ లాటరీ ఫలితాలను ఆదివారం ప్రకటించారు. ఈ లాటరీ ఫలితాల్లో టీఈ-645465 నంబరు టికెట్ బంపర్ బహుమతికి ఎంపిక అయింది. ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన అదృష్టవంతుడు కేరళ ఎర్నాకుళం జిల్లాలోని మరాడుకి చెందిన ఆటో డ్రైవర్ పీఆర్ జయపాలన్ అని సోమవారం నిర్ధారణ అయింది.
ఆటో డ్రైవర్ అయిన జయపాలన్ తన లాటరీ టికెట్‌ను తీసుకొని మరాడు కెనరా బ్యాంక్‌కు వెళ్లగా.. బ్యాంకు సిబ్బంది, అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. లాటరీ విజేతను తానేనంటూ అక్కడున్న వారికి ఆటో డ్రైవర్ జయపాలన్ తెలిపాడు. ఈ లాటరీ టికెట్‌ను సెప్టెంబరు 10న త్రిప్పునితురలో కొనుగోలు చేసినట్లు జయపాలన్ తెలిపాడు. ఫాన్సీ నంబర్‌గా ఉన్న టికెట్‌ను తానే కొన్నానని.. దానితోపాటు.. వేరే టికెట్లను కూడా కొనుగోలు చేసినట్లు జయపాలన్ తెలిపాడు. ఆదివారం వార్తలు చూస్తున్న క్రమంలో మొదటి బహుమతి గెలుచుకున్న విషయం తెలిసిందని తెలిపాడు.
ఈ నంబర్‌కు బహుమతి లభిస్తుందని టికెట్ కొన్నప్పుడే భావించానని.. సంతోషం వ్యక్తంచేశాడు. అయితే.. లాటరీ సంఖ్యను నిర్ధారించిన తర్వాత మాత్రమే బంధువులకు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించాడు. కాగా.. రూ.12 కోట్ల బహుమతి మొత్తంలో అన్నిరకాల పన్నులను మినహాయించగా మిగతా మొత్తం అతనికి దక్కుతుందని బ్యాంకు సిబ్బంది వెల్లడించారు.
Also Read: