Trending News: అక్కడ టీ తాగి కప్ పడేయరు.. తినేస్తారు.. దీని స్పెషాలిటీ తెలిస్తే అవాక్కవుతారు..!

Trending News: సాధారణంగా టీ ని గాజు గ్లాస్‌ లోనో, పేపర్ కప్‌లోనో, స్టీల్ గ్లాస్‌లోనో తాగుతుంటాం. అయితే, టీ తాగిన తరువాత..

Trending News: అక్కడ టీ తాగి కప్ పడేయరు.. తినేస్తారు.. దీని స్పెషాలిటీ తెలిస్తే అవాక్కవుతారు..!
Tea

Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2022 | 6:36 AM

Trending News: సాధారణంగా టీ ని గాజు గ్లాస్‌ లోనో, పేపర్ కప్‌లోనో, స్టీల్ గ్లాస్‌లోనో తాగుతుంటాం. అయితే, టీ తాగిన తరువాత ప్లాస్టిక్ కప్‌ అయితే పడేస్తారు.. స్లీట్, గాజు గ్లాస్‌లు అయితే కడిని పునర్వినియోగిస్తుంటా. కానీ, టీ తాగిని తరువాత ఆ కప్‌ను తినడాన్ని ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా?. ఇప్పుడు వినడమే కాదు.. చూసేయండి. అవును ఇప్పటి వరకు ఎక్కడో టీ తాగి కప్ తినేస్తారు అని టీవీలలో, పేపర్లలో చూసి ఆశ్చర్యంగా చెప్పుకోవడం చూశాం. కానీ, ఇప్పుడు స్వీయ అనుభవం పొందే అవకాశం ఏపీలోని నెల్లూరు జిల్లా ప్రజలకు వచ్చింది. అవును.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోనే అలాంటి టీ కప్ రావడంతో జనాలు తినే టీ కప్ ఎలా ఉంటుందా? దాంట్లో టీ రుచి ఎలా ఉంటుందా? అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ టీ, కప్ తాగి తినేందుకు ఎగబడుతున్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన సతీష్ కుమార్ వినూత్నమైన ఆలోచనతో ‘అఖిల్ టీ స్టాల్’ అనే పేరుతో వెరైటీ కేఫ్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే టీ తాగుతూ అదే కప్ ను తినడం. ఒక సిప్ టీ తాగి బిస్కెట్ ఫ్లేవర్‌లో ఉన్న అదే కప్‌ను తినడం ఇక్కడ స్పెషల్. ఇక్కడ కప్ పడేయడం కానీ, కడగడం కానీ ఉండదు. దీనివల్ల వ్యర్ధాలు ఉండనే ఉండవు. నీటి వినియోగం కూడా తగ్గుతుంది. వినియోగదారుడికి కూడా ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ప్లాస్టిక్, పేపర్ కప్పుల వినియోగం వల్ల చెత్త భారీగా పెరుకుపోతున్న తరుణంలో ఇలాంటి తినే టీ కప్ తీసుకురావడం అనేది పర్యావరణానికి అనుకూలమని చెప్పొచ్చు. ఇలాంటి వినూత్నమైన ఆలోచన చేసిన సతీష్ కుమార్‌ను పట్టణ ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు.

Tea Cup

Also read:

RBI Assistant Exam 2022: ఆర్బీఐ అసిస్టెంట్ మెయిన్స్ 2022 హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

Ajith Valimai: ఇక ఓటీటీలో సందడి చేయనున్న అజిత్.. బ్లాక్ బస్టర్ వలిమై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Big News Big Debate: తెలంగాణలో టెర్రర్‌ కారిడార్‌ నిజమేనా? ఢిల్లీని ఢీకొట్టడానికి KCR యాక్షన్‌లోకి దిగారా?