Aeroplane: విమానం బెల్లీ ల్యాండింగ్ అంటే ఏంటి.? సాంకేతిక లోపం వస్తే పైలెట్లు ఏం చేస్తారంటే

|

Oct 11, 2024 | 9:08 PM

తిరుచ్చి నుంచి షార్జా వెళ్లే AXB-613 ఎయిర్‌ ఇండియా ఫ్లయిట్‌ గాల్లో ఉండగా.. సడెన్‌గా టెక్నికల్‌ సమస్య తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానంలో 141 మంది ప్రయాణికులున్నారు. మరోవైపు ఎటీసీ నెట్‌ వర్క్‌ అలర్టయింది. ముందు జాగ్రత్తగా తిరుచ్చి ఎయిర్‌ పోర్టు దగ్గర 20 అంబులెన్స్‌లు..

Aeroplane: విమానం బెల్లీ ల్యాండింగ్ అంటే ఏంటి.? సాంకేతిక లోపం వస్తే పైలెట్లు ఏం చేస్తారంటే
Representative Image
Follow us on

తిరుచ్చి నుంచి షార్జా వెళ్లే AXB-613 ఎయిర్‌ ఇండియా ఫ్లయిట్‌ గాల్లో ఉండగా.. సడెన్‌గా టెక్నికల్‌ సమస్య తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానంలో 141 మంది ప్రయాణికులున్నారు. మరోవైపు ఎటీసీ నెట్‌ వర్క్‌ అలర్టయింది. ముందు జాగ్రత్తగా తిరుచ్చి ఎయిర్‌ పోర్టు దగ్గర 20 అంబులెన్స్‌లు.. 20 ఫైరింజన్‌లు సహా మెడికల్‌ టీమ్స్‌ను సిద్ధంగా వుంచారు..భారీగా పారామెడికల్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇలా ల్యాండింగ్ కోసం తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు చేయడంతో.. కొన్ని గంటల ఉత్కంఠ పరిస్థితుల అనంతరం ఎయిరిండియా విమానం సురక్షితంగా సేఫ్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. అందులోని ప్రయాణికులంతా సేఫ్‌గా ఉండటంతో అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అసలు హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య ఏర్పడినప్పుడు.. విమానాన్ని దించాలంటే.. బెల్లీ ల్యాండింగ్ ఒకటే మార్గం అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరి ఇంతకీ అదేంటంటే..?

హైడ్రాలిక్‌ సిస్టమ్‌లో సమస్య ఏర్పడిన విమానాన్ని.. అంటే.. విమానం చక్రాలు తెరుచుకోని విమానాన్ని.. సేఫ్‌గా ల్యాండ్‌ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఈ సమయంలో ఒకే ఒక్క దారి ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. అదే బెల్లీ ల్యాండింగ్. ఈ బెల్లీ ల్యాండింగ్‌ సమయంలో.. విమానానికి కచ్చితంగా ఎక్కువ నష్టం జరుగుతుందని చెబుతున్నారు. బెల్లీ ల్యాండింగ్‌ చేసేటప్పుడు.. చాలా వేగంగా లేదా చాలా గట్టిగా ల్యాండ్ జరుగుతుంది. అలాంటి సమయంలో విమానం పల్టీలు కొట్టే ప్రమాదం ఉందంటున్నారు. లేదా.. విమానం ముక్కలు ముక్కలు అయ్యే ఛాన్స్ ఉందనేది ఎక్స్‌పర్ట్స్‌ మాట. అదే జరిగితే.. మంటలు వ్యాపించవచ్చు. అందుకే, విమానంలోని ఇంధనాన్ని ఖాళీ చేయిస్తున్నారు.

బెల్లీ ల్యాండింగ్‌ చేయడానికి.. విమానాన్ని వీలైనంత మేరకు భూమికి సమానంగా తీసుకురావాల్సి ఉంటుంది. అంటే.. రన్‌వే లెవెల్‌కు సమానంగా విమానాన్ని తీసుకొచ్చి ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. దీనికి అత్యంత కచ్చితత్వం అవసరం. అనుభవం ఉన్న పైలట్లు మాత్రమే చేయగలిగిన ఓ సాహసం ఇది. కాకపోతే.. బెల్లీ ల్యాండింగ్‌ను కరెక్టుగా చేయగలిగితే.. ప్రాణనష్టం లేకుండా బయటపడొచ్చు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు చాలా జరిగాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీరెలాంటి వారో చెప్పేస్తోంది.? ఎలాగంటారా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..